Statewide bandh call against privatization of Steel Plant స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రాష్ట్ర బంద్

Statewide bandh call against privatisation of vizag steel plant

VSP privatisation, Vizag Steel Plant privatisation, statewide bandh, APSRTC services, Privatization of PSU, Visakha steel plant, somu veerraju, ISPAT, Vishaka steel Plant, trade Union agitation, Visakhapatnam North Constituency, non-political JAC, Vishakapatnam, Andrha Pradesh, Politics

The statewide bandh call given by Vizag Steel Parirakshana Committee protesting against the privatisation of Vizag steel plant had its impact on the transport services in Andhra Pradesh. The bandh had little impact on functioning of commercial establishments while educational institutions remain closed on Friday.

స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న రాష్ట్ర బంద్

Posted: 03/05/2021 10:56 AM IST
Statewide bandh call against privatisation of vizag steel plant

విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి’ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ (మార్చి 5న) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్ కు అనుకూలంగానే నిర్ణయం తీసుకోవడంలో.. రాష్ట్రంలో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్ కు కేంద్రబింధువుగా నిలిచిన విశాఖపట్నంలో జనజీవనం పూర్తిగా స్థంభించింది. ఇక్కడ బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు మాల్, ధియేటర్లు సహా అన్ని వాణిజ్య సముదాయాలు, వ్యాపార కేంద్రాలు స్వచ్ఛంధంగానే మూసివేసి బంద్ కు సహకరిస్తున్నారు.

ఇక బంద్ లో విపక్ష పార్టీలతో పాటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గోంటోంది. లెఫ్ట్ నేతలతో కలసి విశాఖపట్నంలో ర్యాలీల్లో పాల్గోనింది. ఈ ర్యాలీలో వైసీసీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి లెప్ట్ నేతలతో కలసి పాల్గోన్నారు. అటు బీజేపి- జనసేన నేతలు కూడా మరోవైపు విశాఖలో భారీర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మరోవైపు టీడీపీ పార్టీ నేతలతో పాటు ప్రజా, కార్మిక సంఘాలు బంద్ కు సంపూర్ణంగా మద్దుతు ప్రకటించడంతో పాటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నగరంలో ర్యాలీలు నిర్వహిస్తున్నాయి.

అటు బంద్ కు ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆర్టీసీ కూడా మధ్యాహ్నం ఒంటిగంట వరకు బస్సులను నడవవద్దని నిర్ణయించిందిది. దీంతో బంద్ గురించి తెలియక ప్రయాణాలు చేస్తున్నవాళ్లు బస్టాండ్లలో పడిగాపులు కాస్తున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి వీరికి ఊరట లభించనుంది. బంద్ పిలుపుకు అటు అటో సంఘాలు కూడా పెద్దఎత్తున మద్దతు పలికాయి. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మూసేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లారీ యజమానుల సంఘాలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతునిచ్చాయి.

అయితే విశాఖపట్నంతో పాటు ఇటు రాష్ట్రంలోని నలుమూలల బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. అయితే వైజాగ్ లో బంద్ ప్రభావంతో సంపూర్ణంగా కనిపిస్తుండగా, ఇటు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పాక్షిక స్పందన కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినా.. అర్టీసీ సవలు బంద్ లో భాగంగా రద్దు అయినా.. పలు ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు, షాపింగ్ మాల్, ప్రైవేటు వాణిజ్యసంస్థలు, వ్యాపార కేంద్రాలు పాక్షికంగా నడుస్తున్నాయి. విశాఖ పట్నం మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు, సినీమా థియేటర్లు నడుస్తున్నాయి. భక్తులు ఇబ్బందులకు పాల్పడకుండా తిరుమల కొండపైకి అర్టీసీ సేవలను మాత్రం కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles