Mamata Banerjee questions rationale behind 8-phase polls బీజేపికి లబ్ది చేకూర్చేలా సీఈసీ నిర్ణయాలు: మమత ఫైర్

Dont look at west bengal through saffron lenses mamata banerjee questions rationale behind 8 phase polls

Assembly Election 2021, Election Commission, Mamata Banerjee, TMC, Trinamool Congress, West Bengal, West Bengal Assembly Election 2021, Election dates, Election commission, election dates for Bengal, Poll dates, Bengal poll dates, Poll dates for Bengal, West Bengal Assembly Elections, Assembly Elections, Central Election Commission, Tamil Nadu, Kerala, Puduchhery, Assam, West Bengal, National Politics

Questioning the eight-phase assembly elections in West Bengal, Chief Minister Mamata Banerjee said on Friday that she suspects that the dates were announced as per the suggestions of Prime Minister Narendra Modi and Home Minister Amit Shah for better management of the BJP's poll campaign.

బీజేపికి లబ్ది చేకూర్చేలా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలు: మమత ఫైర్

Posted: 02/27/2021 11:46 AM IST
Dont look at west bengal through saffron lenses mamata banerjee questions rationale behind 8 phase polls

నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో మూడు రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒక రకంగా, పశ్చిమ బెంగాల్ ను మరో రకంగా చూడటం పట్ల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలకు ఏప్రిల్ 6న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా... అసోంకు మాత్రం మూడు విడతల్లో పోలింగ్ జరగనుందని, కానీ తమ పశ్చిమబెంగాల్లో మాత్రం 8 విడతల్లో పోలింగ్ ఎందుకు నిర్వహిస్తు్న్నారని అమె ప్రశ్నించారు.  

అధికార పార్టీ అదుపాజ్ఞనల్లో కేంద్ర ఎన్నికల సంఘం పనిచేస్తుందని ఇప్పటికే పలుమార్లు పలు రాష్ట్రాల్లో నిరూపితం అయ్యిందని, అయినా తాము కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని గౌరవిస్తామని చెప్పిన అమె.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం బీజేపికి లబ్ది చేకూర్చేందుకే 8 విడతల్లో ఎన్నికలను నిర్వహిస్తోందని అరోపించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రి షా సూచనల మేరకు ఈసీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుందని అమె అరోపించారు. ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో పోలింగ్ నిర్వహించాలనే నిర్ణయాలపై కూడా మమత మండిపడ్డారు.

తాము బలంగా వున్న జిల్లాల్లో ఓట్లు చీలిపోవాలని ఒక్క జిల్లాలో పలు దశల్లో పోలింగ్ నిర్వహించడం ఇది బీజేపి అడిస్తున్న నాటకమేనని అరోపించారు. ఇలాంటి ప్రశ్నలు తాము వేస్తామని తెలిసే సీఈసీ సునీల్ అరోరా.. ముందుగానే ఈ అంశంలో క్లారిటీ ఇవ్వడం గుమ్మడికాయల దొంద చందన్ని గుర్తుచేస్తోందని అన్నారు. క్రితం రోజున నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత సునీల్ అరోరా మాట్లాడుతూ.. గత 2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో 7 విడతల్లో పోలింగ్ జరిగిందని, ఈ సారి 8 విడతల్లో పోలింగ్ జరుగుతుందని.. ఇందులో పెద్ద వింతేమీ లేదని పేర్కోన్నా విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles