HP Governor manhandled in Assembly complex బండారు దత్తాత్రేయపై దాడికి కారణమైన ఇంధన ధరాఘాతం

Five congress mlas suspended for allegedly manhandling himachal governor bandaru dattatreya

Bandaru Dattatreya, Himachal Pradesh governor, HP Governor Budget speech, Harsh Vardhan Chauhan, Sunder Singh Thakur, Satpal Raizada, Vinay Kumar. Minister Suresh Bhardwaj, Congress, BJP, Himachal Pradesh, Politics

Himachal Pradesh Governor Bandaru Dattatreya was allegedly manhandled by some Congress members in the Assembly complex, following which five MLAs, including Leader of the Opposition Mukesh Agnihotri, were suspended for the remainder of the Budget Session on a motion moved by Parliamentary Affairs Minister Suresh Bhardwaj.

బండారు దత్తాత్రేయపై దాడి.. ఇంధన ధరలే కారణం..

Posted: 02/26/2021 08:04 PM IST
Five congress mlas suspended for allegedly manhandling himachal governor bandaru dattatreya

యావత్ దేశం ఇంధన ధరల పెంపుపై భగ్గుమంటోంది. ప్రజలను ఇంధన ధరల పెంపుపై పెదవి విరుస్తుండగా, ఈ ధరాఘాతాన్ని విపక్షాలు తమ తమ స్థాయిలో కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వంపై అస్త్రాలుగా సంధించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇంధన ధరల పెంపు సెగ బీజేపీ సీనియర్‌ నాయకుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు కూడా గట్టిగానే తాకింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ ఆయన బడ్జెట్ సెషన్ ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన తన ప్రసంగాన్ని వినిపించాగా.. అందులో ఇంధన ధరల పెంపు అంశాన్ని ఎందుకు జోడించలేదని కాంగ్రెస్ సభ్యులు ఆయనపై దాడికి యత్నించడంతో ఆయనకు తీవ్ర పరాభవం ఎదురయ్యింది.

కాంగ్రెస్ సభ్యుల నినాదాల మధ్య తన ప్రసంగాన్ని అర్థంతరంగా ముగించుకుని తన కారు వద్దకు వెళ్తున్న గవర్నర్ బండారు దత్తాత్రేయపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దాడి చేశారు. అంతేకాదు ఆయన వాహనాన్ని కూడా అడ్డుకుని ఘెరావ్ చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎల్పీ నేతతో పాటు నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హిమాచల్ స్పీకర్ సమావేశాల చివరి వరకు సస్పెండ్ చేశారు. ఈ శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారని తెలిపారు.

హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 22 సోమవారం నాడు ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలని తీర్మానం ప్రవేశపెట్టారు. వీరిలో ప్రతిపక్ష నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి, ఎమ్మెల్యేలు హర్ష్ వర్ధన్ చౌహాన్, సుందర్ సింగ్ ఠాకూర్, సత్పాల్ రైజాదా, వినయ్ కుమార్ ఉన్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడిన సభ ఇవాళ తిరిగి ప్రారంభం అ‍య్యింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి నేతృత్వంలోని కాంగ్రెస్ సభ్యులు తమ సీట్ల నుంచి లేచి నినాదాలు చేశారు. గవర్నర్‌ అసెంబ్లీలో ప్రసంగం చివర్లో ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు.  

దాంతో గవర్నర్ తన ప్రసంగంలోని చివరి లైన్లను మాత్రమే చదివి, ప్రసంగం మొత్తం చదివినట్లుగా భావించాలని పేర్కొన్నారు. గవర్నర్‌ ప్రసంగంపై కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెల్లడించిన విషయాలన్ని అబద్ధాలని ఆరోపించారు. వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సమస్యను ప్రసంగంలో చేర్చలేదన్నారు. స్పీచ్‌ ముగించిన అనంతర దత్తాత్రేయ తన కారు దగ్గరకు వెళ్తుండగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కాంగ్రెస్ సభ్యుల ప్రవర్తనను ఖండించారు. ఇక గవర్నర్‌పై దాడి చేసిన ఎమ్మెల్యేలను మార్చి 20 వరకు సస్పెండ్‌ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles