girl chased and nabbed thief in yousufguda రాత్రివేళ దొంగను వెంబడించి పట్టుకున్న మహిళ

Hyderabad girl chased and nabbed her mobile phone thief

Hyderabad Metro, Bhumika vimal, Naveen Naik, Yousufguda, book a cab, Hyderabad Police, Telangana, TS Police, crime news

A 29 years old Bhumika vimal women chased a thief who robbed her mobile phone in a second and ran away in to Krishna nagar area. Bhumika took help of a biker and nabbed theif and hand overed him to Hyderabad Police.

క్యాబ్ కోసం వేచి చూస్తున్న యువతి.. అటుగా వచ్చిన జూనియర్ అర్టిస్ట్

Posted: 02/25/2021 02:50 PM IST
Hyderabad girl chased and nabbed her mobile phone thief

చైన్ స్నాచర్లు, మొబైల్ స్మార్ట్‌ఫోన్ స్నాచర్లు రోజురోజుకీ పెరుగిపోతున్నారు. మహిళలను, వయస్సుపైబడిన మధ్యవయస్కులతో పాటు వృద్దులను టార్గెట్ చేసే దొంగలు వారి మెడ‌లోంచి త‌మ‌ చైన్లను, సెల్ ఫోన్లను లాక్కుని పారిపోతుంటారు. ఇలాంటే ఘటనలను ఎదుర్కోన్న చాలా మంది మ‌హిళ‌లు కేకలు వేస్తూ సాయాన్ని అర్థించగా, వారికి సాయం చేసేవారు స్పందించేలోగా దొంగలు అక్కడి నుంచి వాయువేగంతో వెళ్లిపోవడంతో వారి ఆచూకీ తెలియకుండా పోతుంది. అయితే ఇలాంటి ఘటనను ఎదుర్కోన్న ఓ మహిళ మాత్రం దొంగను టార్గెట్ చేసి మరీ పట్టుకుంది.

ఇందుకోసం రాత్రి సమయం అని కూడా బెరకుచెందని యువతి ఏకంగా ఆరువందల మీటర్ల దూరం పాటు దొంగను వెంబడించింది. అతడి ముఖాన్ని పట్టేసుకున్న యువతి దొంగ ఎక్కడికి పరిగెత్తాడు.. ఎక్కడ దాక్కున్నాడు అన్ని విషయాలను నిశితంగా గమనిస్తూనే అతడ్ని వెంబడించింది. ఇందంతా ఓ కంట కనిపెడుతూనే పరుగెత్తుకెళ్లిన దొంగ.. అమె ఇక రాదని భావించినా.. ఎందుకనో అతడు కూడా కీడు శంఖించి మెల్లిగా వెళ్లి ఓ గల్లిలోకి దూరి అక్కడ గోడ వెనుక నక్కాడు. దీంతో మహిళ.. వెంబడించి అతడు నక్కిన చోటు నుంచే లాక్కుని వచ్చి తన ఫోన్ ను లాక్కుంది. దీంతో అతనికి స్థానికులు దేహశుధ్ది చేసి పోలీసులకు అప్పగించారు.

హైద‌రాబాదులోని యూసఫ్ గూడ‌లో చోటు చేసుకున్న ఈ ఘటన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే సికింద్రాబాద్ కు చెందిన భూమిక అనే మహిళ ఓ బొటిక్ లో డిజైనర్ గా పనిచేస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.12లోని త‌న కార్యాల‌యంలో విధులు ముగించుకుని యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ ‌వద్దకు చేరుకుంది. మెట్రో రైలు ఎక్కేందుకు న‌డుచుకుంటూ వెళ్లిన అమెకు పదిన్నర తరువాత మెట్రో రైళ్లు ఆ మార్గంలో నడవడం లేదని తెలిసి కిందకు చేరుకుని క్యాబ్ బుక్ చేసుకుందామని తన సెల్ ఫోన్ తీసి క్యాబ్ కోసం వెతుకుతుంది.

అమెను అంతకు కొద్ది సమయం నుంచి గమనిస్తున్న దొంగ.. ఆమె వెనకాలే వ‌చ్చి.. ఆమె చేతిలో ఉన్న ఫోన్‌ లాక్కొని పరుగు తీశాడు. దీంతో భూమిక అరుస్తూ.. దొంగ వెనకాలే పరిగెత్తింది. దొంగ కృష్ణానగర్ వైపు పరుగు తీయడంతో అమె కూడా అటుగానే పరుగుతీసింది. మహిళ అలా పరుగెత్తడంతో ఓ వాహనదారుడు అపి.. వివరాలు తెలుసుకుని అమెను తన బైక్ పై ఎక్కించుకుని కృష్ణానగర్ కు చేరుకున్న తరువాత డ్రాప్ చేశాడు. శ్రీకృష్ణానగర్ లోని సింధు టిఫిన్‌ సెంటర్ వీధిలో దొంగ‌ను గుర్తించిన భూమిక అత‌డి కాలర్ ‌పట్టుకొని లాగి, అత‌డి చేతిలో ఉన్న తన సెల్‌ఫోన్ ను లాక్కుంది.

అనంత‌రం స్థానికులు మహిళ చేతిలో సెల్ ఫోన్ ను దొంగలిస్తావా అంటూ అతడికి దేహశుద్ది చేశారు. ఈలోగా అతడ్ని కొట్టవద్దని పోలీసులకు అప్పగిద్దామని చెప్పిన మహిళకు స్థానికులు సాయంగా.. దొంగ పారిపోకుండా ప‌ట్టుకున్నారు. భూమిక 100కి ఫోన్‌‌ చేయడంతో వెంట‌నే జూబ్లీహిల్స్‌ పోలీసులు అక్కడికి చేరుకుని దొంగ‌ను అరెస్టు చేశారు. అత‌డి పేరు జే న‌వీన్ నాయ‌క్ (20)గా గుర్తించారు. అయితే సినీపరిశ్రమలో జూనియర్ అర్టిస్టుగా పనిచేస్తున్నా.. గత కొంత కాలంగా ఎలాంటి అవకాశాలు రాక.. అతడు అప్రయత్నంగానే దొంగగా మారాల్సివచ్చిందని తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles