Putta Madhu Made Sensational Comments On Media పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టామధు సంచలన వ్యాఖ్యలు

Telangana lawyer couple murder former manthani trs mla putta madhu made sensational comments on media

Putta Madhu, Pedapalli ZP Chair Person, Veldi Vasantha Rao, Kunta Srinivas, DCP Ravinder, PV Nagamani Audio Tape, Akkapaka Kumar, Bittu Srinu, Murder, Lawyer Couple, Telangana High Court, Chief Justice Telangana High court, Justices Hima Kohli, HIgh Court Division Bench, Justice B. Vijaysen Reddy, Gattu Vaman Rao, PV Nagamani, Manthani, Ramagundam Police, Telangana, crime

Former Manthani MLA of TRS, Putta Madhu made sensational comments on media. He said that media should present the truth infront of the people. He further added that he has lost faith in media. Putta Madhu said that media is dragging his family and his name into unnecessary issues.

ITEMVIDEOS: న్యాయవాదుల హత్య కేసు: మీడియాపై పుట్టా మధు సంచలన వ్యాఖ్యలు

Posted: 02/20/2021 07:54 PM IST
Telangana lawyer couple murder former manthani trs mla putta madhu made sensational comments on media

తెలుగురాష్ట్రాల్లో పెనుసంచలనంగా మారిన న్యాయవాద దంపతుల దారుణ హత్యకేసులో తన మేనల్లుడి అరెస్టుతో పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధు కూడా అరోపణలు ఎదుర్కోంటున్నారు. కుంట శ్రీను ఓ సుపారీ గ్యాంగ్ స్టర్ తో ఫోన్ సంభాషణలో మధన్న అంటూ.. అన్నా అంటూ ఉచ్చరించిన పేరు పుట్టా మధుదే కావడం గమనార్హం. అయితే అన్న ధయతో తాను 28 ఎకరాలు సంపాదించానని, మీమల్ని కూడా చూసుకుంటాడని కూడా కుంట శ్రీను చెప్పిన అడియో క్లిప్ ఇప్పటికే నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పుట్టా మధు పరారీలో వున్నాడని కూడా వదంతులు వచ్చాయి.

దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ కేసులో పోలీసుల కన్నా మీడియానే అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. మీడియా చేస్తున్న అసత్య ప్రచారానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారని మండిపడ్డారు. పోలీసులు చేయాల్సిన దర్యాప్తును మీడియా సంస్థలే చేస్తున్నట్టుందని విమర్శించారు. తాను మంథనిలో లేనని, కనపడకుండా వెళ్లిపోయానని కొన్ని పేపర్లు, టీడీపీ ప్రచారం చేశాయని... తాను ఎక్కడికీ పారిపోలేదని, మంథనిలోనే ఉన్నానని చెప్పారు. మంథనిలో నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మీడియాపై ఫైర్ అయ్యారు.

హత్య జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు తాను మంథనిలోనే ఉన్నానని పుట్ట మధు తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ లు తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నారని... తాను వారి అపాయింట్ మెంట్లు అడగలేదని చెప్పారు. మీడియా సంస్థలు తనను జైలుకు పంపించేందుకు తాపత్రయ పడుతున్నాయని మండిపడ్డారు. తనపై, తన కుటుంబంపై మీడియా ఎందుకు కక్షకట్టిందో అర్థం కావడం లేదని అన్నారు. ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేశానని చెప్పారు. ఈ హత్య కేసును  పోలీసులు విచారిస్తున్నారని, విచారణ తర్వాత అన్ని ఆధారాలతో హైదరాబాదులో మీడియాతో మాట్లాడతానని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles