ఉత్తర్ ప్రదేశ్ మరో దారుణం జరిగింది. అందునా దళిత యువతిపై స్థానిక బీజేపి ఎమ్మెల్యే అత్యాచారానికి పాల్పడిన కేసుతో సంచలనంగా మారిన ఉన్నావ్.. లో మారుమారు అదే దళిత బాలికలు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం పెనుసంచలనంగా మారింది. పశుగ్రాసం కోసం స్థానికంగా ఉండే అడవిలోకి వెళ్లిన చిన్నారులు.. అపస్మారక స్థిలో వుండటం కలకలం రేపింది. హుటాహుటిన వీరిని అసుపత్రకి తరలించగా, వారిలో ఇద్దరు దళిత బాలికలు అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో బాలిక కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
ఘటనా స్థలంలో వారి కాళ్లూచేతులు కట్టిపడేసి ఉన్నాయని, అవి ముమ్మాటికీ హత్యలేనని వారి తరఫు బంధువులు, గ్రామస్థులు ఆరోపిస్తుండగా, పోలీసులు మాత్రం విష ప్రయోగం జరిగిన ఆనవాళ్లున్నాయని తెలిపారు. పశు గ్రాసం కోసం ముగ్గురు బాలికలు సాయంత్రం 3 గంటల ప్రాంతంలో వారి పొలానికి వెళ్లారని ఉన్నావ్ ఎస్పీ ఆనంద్ కులకర్ణి తెలిపారు. అయితే, సాయంత్రమైనా వారు ఇంటికి తిరిగిరాకపోవడంతో, వెతుక్కుంటూ పొలానికి వెళ్లిన కుటుంబ సభ్యులకు అచేతన స్థితిలో పడి ఉన్న అమ్మాయిలు కనిపించారన్నారు. వారి ఫిర్యాదు మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నామని, అప్పటికే వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని తెలిపారు.
అయితే, 13, 16 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలికలు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు చెప్పారని, 17 ఏళ్ల వయసున్న మరో బాలికకు చికిత్స చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందన్నారు. దీంతో వెంటనే ఆమెను కాన్పూర్ రీజెన్సీ ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని వివరించారు. అందరి వాదనలను పరిగణనలోకి తీసుకుని కేసును దర్యాప్తు చేస్తామని కులకర్ణి చెప్పారు. ప్రాథమిక ఆధారాలను బట్టి వారి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవన్నారు.
కుటుంబ సభ్యులు ఇవి ముమ్మాటికీ హత్యలేనని ఆరోపించారు. తాము ఘటనా స్థలానికి వెళ్లేసరికి ముగ్గురి కాళ్లూచేతులు కట్టిపడేసి ఉన్నాయని, పరిస్థితి విషమంగా ఉన్న అమ్మాయి మెడను చున్నీతోనూ బిగించారని గ్రామస్థులు చెబుతున్నారు. వారి నోటి వెంట నురగలు వచ్చాయన్నారు. అయితే, ఇప్పుడే ఆ విషయాన్ని నిర్ధారించలేమని లక్నో రేంజ్ ఐజీ లక్ష్మి సింగ్ తెలిపారు. కాగా, మూడో బాలికకు మెరుగైన చికిత్సను అందించాలని, వెంటనే ఢిల్లీ ఎయిమ్స్ కు ఆమెను తరలించాలని భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. దేశంలో నానాటికీ దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఇలాంటి అరాచకాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Jul 01 | రాష్ట్రంలో ఆన్లైన్ సినిమా టికెట్ల విధానం అమలు చేయాలని కృతనిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగన్ సర్కారుకు చుక్కెదురైంది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 69పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం... Read more
Jul 01 | ఐబిపిఎస్ (IBPS) క్లర్క్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి... Read more
Jul 01 | తన కారు డ్రైవర్ హత్యాభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్‌ను న్యాయస్థానం మరోమారు పొడిగించింది. గత మే 23 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అనంతబాబు రిమాండ్ గడువు నేటితో... Read more
Jul 01 | మారుతున్న పనివేళలు, ఉద్యోగ కల్పన ఇత్యాదుల నేపథ్యంలో నూతన కార్మిక చట్టాలను తీసుకురావాలని కేంద్రప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 1 నుంచి ఈకొత్త కార్మికచట్టాలను అమలుపర్చాలని చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది.... Read more
Jul 01 | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎట్టకేలకు ముగిసి.. శివసేన రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు ఏక్ న్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నావిస్ ఢిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ తరుణంలో.. ప్రజలకు... Read more