Kodali Nani responds to SEC’s show-cause notice ఎస్ఈసీ షోకాజ్ నోటీసులపై కొడాలి నాని వివరణ

Kodali nani responds to sec s show cause notice says allegations are not true

panchayat elections, N. Ramesh Kumar, Kodali Nani, AP Panchayat elections 2021, AP Panchayat elections 2021 results, AP Panchayat election, AP Panchayat election results, Andhra Pradesh Panchayat elections 2021, panchayat elections, JanaSena, BJP, TDP, Congress, opposition parties, Andhra pradesh, Politics

Civil Supplies Minister Kodali Nani gave reply to show-cause notice served to him by State Election Commissioner Nimmagadda Ramesh Kumar. He claimed that he has enormous respect towards the SEC. “I never intentionally made remarks to insult the SEC,” he added.

షోకాజ్ నోటీసులపై వివరణ: ఎస్ఈసీ అంటే తనకు గౌరవమని వ్యాఖ్య

Posted: 02/12/2021 08:02 PM IST
Kodali nani responds to sec s show cause notice says allegations are not true

ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న నిమ్మగడ్డ రమేశ్ పై ఇటీవల మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై సీరియస్ అయిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్.. మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు పంపాడు. వీటికి తాజాగా మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చాడు. తాను ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీడీపీ అరాచకాల్ని వివరించడానికే ప్రెస్ మీట్ నిర్వహించానని అన్నారు.

ఉద్ధేశపూర్వకంగా రాష్ట్ర ఎన్నికల అధికారిని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని కొడాలి నాని తెలిపారు. తన వ్యాఖ్యల్ని ఎస్ఈసీ అపార్ధం చేసుకున్నారని  కొడాలి వివరణ ఇచ్చారు. తాను ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యల నిజమైన భావాన్ని ఎస్ఈసీ అర్ధం చేసుకోలేదని కొడాలి నాని తెలిపారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ జారీ చేసిన షోకాజ్ నోటీసులో తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలు అవాస్తవమని మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చారు. ఈ ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు.

రాజ్యాంగ బద్ధ సంస్ధలంటే తనకు ఎంతో గౌరవమని ముఖ్యంగా ఎస్ఈసీ అంటే తనకు గౌరవమని మంత్రి కొడాలి పేర్కొన్నారు. అంతకుముందు ప్రెస్ మీట్లో చంద్రబాబు నిమ్మగడ్డ ఎవరు అడ్డొచ్చినా పంచాయతీ ఎన్నికల ఫలితాలు వైసీపీకే అనుకూలంగా ఉంటాయని.. వీరంతా జగన్నాథ రథచక్రాల కింద పడి నలిగిపోవడం ఖాయమని కొడాలి నాని నిప్పులు చెరిగారు. దీంతో ఎస్ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నాని వివరణ ఇవ్వడంతో తదుపరి చర్యలను ఎస్ఈసీ నిమ్మగడ్డ తీసుకునే అవకాశం ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : panchayat elections  SEC  N. Ramesh Kumar  Kodali Nani  AP MInister  YSRCP  TDP  JanaSena  BJP  Andhra pradesh  Politics  

Other Articles

Today on Telugu Wishesh