LPG cylinder prices to be reviewed weekly ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలపై వారోకోసారి సమీక్ష

Lpg subsidy gas commercial gas cylinder prices to be reviewed weekly

LPG cylinders prices to be reviewed on weekly basis, LPG, cooking gas price, LPG cylinder price, LPG subsidised Cylinder, LPG commercial Cylinder, Oil companies, Indane, Bharat Gas, HP Gas, Dharmendra pradhan, economy news, finance news, business news

The price of LPG Cylinder may be changed every week. Currently, these prices are fixed on a monthly basis but in view of the daily fluctuations in the prices of petroleum products, oil companies are now planning to change the prices on a weekly basis.

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలపై వారోకోసారి సమీక్ష

Posted: 02/09/2021 11:37 AM IST
Lpg subsidy gas commercial gas cylinder prices to be reviewed weekly

కరోనా మహమ్మారితో కుదేలైన సామాన్యులపై అటు ప్రభుత్వం, ఇటు ఇంధన సంస్థలు ధరాఘాతాలతో దాడి కోనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఇంధన ధరలపై గత ఏడేళ్లుగా విధించిన అదనపు ఎక్సైజ్ పన్నులతో వాహనదారులు తమ వాహనాలను ఇళ్లకు పరిమితం చేసి.. ప్రజారవాణ బాటపడుతున్నారు. ఇదిచాలదన్నట్లు ఇక వంటింట్లోని మహిళలను కూడా ఇంధన సంస్థలు టార్గెట్ చేశాయి. ఇప్పటి వరకు రెండు నెలలకో పర్యాయం పెరుగుతూ వస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఇకపై వారం వారం బాదేందుకు ఇంధనసంస్థలు రెడీ అయ్యాయి.

గ్యాస్ ధరల విషయంలో పెట్రోలు, డీజిల్ పద్ధతిని అనుసరించాలని యోచిస్తున్న కేంద్రం.. ఈ మేరకు ఇంధన సంస్థలకు ముందుగా వారం వారం ధరలను సమీక్షించేందుకు అనుమతినిచ్చిందని సమాచారం. దీంతో అంతర్జాతీయ మార్కెట్ ధరల ఆధారంగా గ్యాస్ ధరలను వారానికి ఒకసారి మార్చాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా నిర్ణయించింది. గతేడాది డిసెంబరులో రెండుసార్లు గ్యాస్ ధరలను పెంచిన ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్‌పై ఏకంగా రూ. 100 పెంచింది. ఇటీవల బడ్జెట్ నేపథ్యంలో గ్యాస్ ధరలపై కేంద్రం సబ్సీడీని మరింత తగ్గించింది. దీంతో దేశవ్యాప్తంగా గ్యాస్ ధరలు భగ్గుమంటున్నాయి.

గ్యాస్ ధరలను భారీగా పెంచినా.. సబ్సీడీలను ఎత్తివేస్తూ నిర్ణయాలు తీసుకున్నా ఇటు ప్రజల నుంచి కానీ, అటు ప్రతిపక్షా నుంచి కానీ ఏమాత్రం వ్యతిరేకత రాకపోవడంతో.. ఇక  జనవరి నుంచి వారానికో పర్యాయం పెరుగుతున్న గ్యాస్ ధరలను.. ఇక మరో రెండు నెలలు అంటే ఏప్రిల్ మాసం నుంచి రోజు వారీ ధరల సవరణ విధానాన్ని అమలు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని సమాచారం. ఈమేరకు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇంధన సంస్థలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధరలు వారానికో పర్యాయం సవరణలు జరగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles