Two held for biting off doctors finger in madhya pradesh ఫీజు అడిగిన వైద్యుడి వేలు కొరికి చేతిలో పెట్టిన రోగి..

Madhya pradesh man cut finger doctor after treatment chhindwara police arrest 2 people

patients bites of doctor finger, doctor fees paid off by patients, shani chandra bazaar clinic doctor SK Bindra, Akaash Tiwari, Vijay Ulka, SK Bindra, Doctor, Doctor Fees, Shanichandra bazaar, Kundipura police station, Chhindwara Madhya Pradesh, Crime

Madhya Pradesh police arrests two persons for allegedly biting doctors finger for asking them to pay fee after getting treated by him. The inccident took place in shanichandra bazaar of Kundipur police station limits in Chhindwara district of Madhya pradesh.

ఫీజు అడిగిన వైద్యుడి వేలు కొరికి చేతిలో పెట్టిన పేషంట్..

Posted: 02/08/2021 02:07 PM IST
Madhya pradesh man cut finger doctor after treatment chhindwara police arrest 2 people

తన కోసమే తన శత్రువు అన్న విషయం తెలిసినా.. మనిషులు మాత్రం తమ కోపాన్ని అదుపు చేసుకోవడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు. ఈ క్రమంలో అవేశకామేశాలకు లోనై వారు తీసుకునే నిర్ణయాలతో పెద్ద మూల్యాన్ని ప్రతిఫలంగా అనుభవిస్తుంటారు. ఇలాంటిదే ఓ ఘటన మధ్యప్రదేశ్ లోని చింద్వారాలో చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన రోగికి వైద్యం చేసిన తరువాత ఫీజు అడిగితే.. అవేశానికి గురైన రోగి.. వైద్యుడి వేలును నరికి అతని చేతిలో పెట్టాడు. క్లినిక్ సిబ్బంది పిర్యాదు మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారాలోని కుండిపుర పోలిస్ స్టేషన్ పరిధిలోని శనిచంద్ర మార్కెట్ లో డాక్టర్ ఎస్.కె బింద్రాకు చెందిన క్లినిక్ వుంది. ఈ క్లినిక్ కు విజయ్ ఉల్కా అతని స్నేహితుడు ఆకాష్ తివారీ శనివారం అర్థరాత్రి సమయంలో వచ్చి చికిత్స చేయించుకున్నారు. చికిత్స  ముగిసిన తరువాత వైద్యుడు ఫీజు అడిగితే అతనితో వాదోపవాదానికి దిగారు. వైద్యుడైన బింద్రా తమ నుంచి అధిక మొత్తంగా ఫీజు డిమాండ్ చేస్తున్నాడని క్లినిక్ లోనే తీవ్రస్థాయిలో మండిపడ్డ రోగులు.. క్లినిక్ లోని సామాగ్రిని చిందరవందర చేశారు.

అప్పటికీ వారి క్లినిక్ సిబ్బంది వారిస్తున్నా వారు వైద్యుడు బింద్రాతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన బింద్రా చేతి వేలిని బాధితుడితోపాటు వచ్చిన విజయ్ తివారీ అనే వ్యక్తి కొరికి చేతి నుంచి వేలిని వేరు చేసి అతని చేతిలోనే పెట్టి ఇదే ఫీజుగా భావించాలని అన్నారు. దీంతో క్లినిక్ లోని సిబ్బంది పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులైన విజయ్ ఉల్కా అతని స్నేహితుడు అకాశ్ తివారీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వైద్యుడు బింద్రాను చికిత్స నిమిత్తం ప్రభుత్వ అసుపత్రికి తరలించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles