Petrol ₹ 93 in Ram’s India, ₹ 51 in Ravan’s Lanka మోడీ సర్కార్ పెట్రో జలక్.. వైరల్ గా బీజేపి ఎంపీ ట్వీట్..

Bjp mp subramanian swamy speaks petrol 93 in ram s india 51 in ravan s lanka

Subramanian Swamy, Budget 2021, Petrol Price, Diesel Price, BJP, diesel, petrol, tweet, viral news, social media,, VAT (Value Added Tax), Fuel Charges, petrol, diesel, vat on petrol, vat on diessel, petrol price, diesel price, National politics

A day after Union Budget 2021, Rajya Sabha MP Subramanian Swamy posted a photo on Twitter comparing India’s fuel prices with that of neighbouring Nepal and Sri Lanka. Swamy who is known for no-nonsense approach when it comes to expressing his views wrote,

మోడీ సర్కార్ పెట్రో జలక్.. వైరల్ గా బీజేపి ఎంపీ ట్వీట్..

Posted: 02/02/2021 01:25 PM IST
Bjp mp subramanian swamy speaks petrol 93 in ram s india 51 in ravan s lanka

కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ రెండో పర్యాయం వచ్చిన తరువాత అంత్జాతీయంగా ఇంధన ధరలకు ఆకాశాన్ని చూస్తున్నాయి. దీంతో దేశంలో పెట్రోల్ ధరలు గతంలో ఎన్నడూ చేరని గరిష్టస్థాయికి చేరుకున్నాయి. రాజస్థాన్ సహా పలు ప్రాంతాల్లో ఇంధన ధరలు ఏకంగా వంద మార్కును దాటేశాయి. ఇది చాలదన్నట్లు నిన్నటి కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యవసాయ సెస్సు విధిస్తున్నట్లు కూడా కేంద్ర ప్రకటించడం వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో ఈ సెస్ ను కేంద్ర విధించిన సెస్సు నుంచి భరిస్తామని.. దీని భారం వాహనదారులపై పడనీయబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ ప్రకటించారు.

అయినా భారం మాత్రం సామాన్యులపైనే పరోక్షంగా పడుతోందని వాహనదారులు నిట్టూరుస్తున్నారు. కేంద్రానికి చేరే ప్రతీ పైసా ప్రజలదేనని, ప్రజలపై విధించే పన్నులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయన్న విషయం తమకు తెలియదా.. నిజంగా కేంద్రం వ్యవసాయ సెస్సును వాహనదారులపై విధించకుండా వుండాలంటే.. ప్రధాని నరేంద్రమోడీ హయాంలో పలు పర్యాయాలు విధించిన ఎక్సైజ్ పన్నులను రద్దు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఏకంగా రెండు పదలు స్థాయిలో పన్నులను పెంచిన కేంద్రం.. వ్యవసాయ సెస్సు మాత్రం తామే భరిస్తామని చెప్పడంలో నిగూఢ అంతరార్థం ఉందని భావిస్తున్నారు.

ఈ క్రమంలో బీజేపి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా షేర్ చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ‘‘రామ జన్మభూమిగా భావించే భారత్ లో లీటర్‌ పెట్రోల్‌ ధర 93 రూపాయలుగా వుండగా.. సీతమ్మవారు పుట్టిన దేశం నేపాల్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర 53 రూపాయలు.. అదే రావణుడి లంకలో పెట్రోల్‌ లీటర్‌ 51 రూపాయలు మాత్రమే’’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు. ఇక దేశంలో ఇంధన రేట్లు పెరిగిన నాటి నుంచి ఈ ఫోటో వైరలవ్వగా.. సుబ్రహ్యణ్య స్వామి ట్వీట్‌ చేయడంతో మరోసారి ఇది వైరలవుతోంది. ఇక దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles