Banks to Charge For Deposit, Withdrawal of Money ఎడాపెడా చార్జీలతో బాదేస్తున్న బ్యాంకులు..

Banks to charge for deposit withdrawal of money

Banks, Bank of Baroda, Bank of India, PNB, Axis Bank, Central Bank, Banks charging for transactions, Banks charging on deposits, Banks charging on withdrawl, Finance Ministry, RBI

Reports had it that Bank of Baroda will start charging its customers for transactions beyond the prescribed limits from November 1. Names of other banks like Bank of India, PNB, Axis Bank and Central Bank had also cropped up.

ఎడాపెడా చార్జీలతో బాదేస్తున్న బ్యాంకులు.. ఖాతాదారులు కుదేలు..

Posted: 02/01/2021 07:31 PM IST
Banks to charge for deposit withdrawal of money

కరోనా మహమ్మారి విజృంభన నేపథ్యంలో అర్థికంగా చితికిపోయిన సగటు బ్యాంకు ఖాతాదారులను ఇప్పడు బ్యాంకులు కూడా కుదేలయ్యేలా చేస్తున్నాయి, వాక్సీన్ వస్తుందన్న ఆశ, కరోనా విజృంభనలో నెమ్మదించిన వేగంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నఖాతాదారులపై ఎడాపెడా చర్జీలతో బ్యాంకులు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రతి దానికి ఏదో ఒక ఛార్జ్ వసూలు చేస్తూ వినియోగదారుడి వీపు విమానం మోత మోగిస్తున్నాయి. దేనికి ఏ ఛార్జీ వసూలు చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో బ్యాంకు వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

గత కొన్నేళ్ల క్రితం ఏ బ్యాంకు శాఖలో చెక్కును అదే బ్యాంకు శాఖలో విత్ డ్రా చేసుకోవాల్సి వచ్చేంది. కానీ ఈ మధ్యకాలంలో అంతా అన్ లైన్ కావడంతో ఒక బ్యాంకుకు చెందిన ఆ బ్యాంకులోని ఏ శాఖలోనైనా విత్ డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. తాజాగా దీనిపై కూడా ఇటీవలి కాలంలో బ్యాంకులు ఎడాపెడా బాదేస్తున్నాయి. ఒకే బ్యాంకు అయినా ఆ శాఖలో కాకుండా ఇతర శాఖలో డబ్బులు విత్ డ్రా చేస్తే.. అందుకుగాను ఏకంగా వెయ్యికి ఐదు రూపాయల చోప్పున చార్జీలను విధిస్తున్నారు. దీంతో అదే బ్యాంకు చెందిన ఇతర శాఖ నుంచి డబ్బులు విత్ డ్రా ఖాతాదారుడి జేబుకు చిల్లు పడక తప్పడం లేదు.

ఇక డబ్బులు వేసినా, తీసినా బాదుడే ఉంటోంది. కరోనా నేపథ్యంలో నగదు నిర్వహణ భారం పెరిగిందనే సాకు చూపి ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. గత నవంబర్ 1 నుంచే కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పద్ధతులను పాటిస్తున్నాయి. గతంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో నెలకు ఐదు లావాదేవీలు ఉచితంగా నిర్వహించుకునే వీలుండేది. ఇప్పుడు వాటిని మూడింటికి తగ్గించారు. పొదుపు ఖాతాలపై ప్రస్తుతం 2 శాతం వడ్డీ లభిస్తోంది. ఫిక్సుడు డిపాజిట్లపై స్వల్ప కాలానికి 3 శాతానికి మించి రావడం లేదు.

ఇదే సమయంలో నగదు డిపాజిట్లపై వేస్తున్న ఛార్జీలు అంతకు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. రూ. 2 లక్షల పరిమితి మించితే ప్రతి వెయ్యికి రూ. 2 చొప్పున ప్రభుత్వ బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ప్రైవేటు బ్యాంకులు రూ. 2 నుంచి 5 వరకు వసూలు చేస్తున్నాయి. ఏటీఎం, నేరుగా ఉపసంహరణలు, నగదు డిపాజిట్లు రూ. 2 లక్షలు దాటితే ఛార్జీలు వేస్తున్నారు. బ్యాంకుల బాదుడుపై వినియోగదారులు మండిపడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank charges  withdrawl  deposits  same bank non branch  Finance Ministry  RBI  

Other Articles