India may need 66.6cr doses of vaccine తొలి విడతలో 30 కోట్ల మందికి 66.6 కోట్ల వాక్సీన్ అవసరం

India will need 66 6 crore doses to vaccinate 30 crore people

vaccine wastage, global transport wastage, vaccine wastage formula, Covid-19 vaccine, primary patients, beneficiaries, vaccine wastage multiplication factor, purchases of vaccine, Vaccines, Universal Immunisation Programme, Doses, coronavirus vaccine, covid-19, Cold Chain

As part of preparations to administer the Covid-19 vaccine to the masses, the Union health ministry has drawn up a formula to estimate the number of vaccines the government would need. Going by the formula, India will need to procure 111 doses to inoculate every 50 beneficiaries.

తొలి విడతలో 30 కోట్ల మందికి 66.6 కోట్ల వాక్సీన్ అవసరం

Posted: 01/05/2021 09:14 PM IST
India will need 66 6 crore doses to vaccinate 30 crore people

(Image source from: Timesofindia.indiatimes.com)

దేశంలోని యాభై ఏళ్లు పైబడిన ప్రజలతో పాటు మధుమేహ, అధిక రక్తపోటు వ్యాధులతో దీర్ఘకాలికంగా చికిత్స పోందుతున్న వారికి త్వరతిగతిన కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించేందుకు వారికి తొలివిడతలో బాగంగా కరోనా వ్యాక్సిన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో జనవరి నుంచి ప్రారంభం కానున్న తొలి విడత వాక్సీన్ల జారీలో ఈ తరహాలోని 3‌0 కోట్ల మందికి టీకా అందించేందుకు ఇప్పటికే దేశవ్యాప్తంగా డ్రైరన్ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఏకంగా ముఫై కోట్ల మందికి రెండు డోసుల చోప్పును వాక్సీన్ అందించే క్రమంలో కొంత వాక్సీన్ వేస్టేజీగా కూడా కానుంది.

అయితే ఈ వేస్టేజీ ఎంత శాతంలో వుండవచ్చునన్న గణంకాలను కూడా అంచనా వేసిన కేంద్ర వైద్యఅరోగ్య శాఖ.. 66.6 కోట్ల డోసులు అవసరమవుతాయని లెక్కగట్టింది. ఎంత లేదనుకన్నా వ్యాక్సిన్లలో చాలా సంఖ్యలో వృథా అయ్యే అవకాశం ఉందని భావిస్తోంది. 28 రోజుల వ్యవధిలో రెండో డోసు వాక్సీన్ తీసుకునే క్రమంలో ఈ పూర్తి కాలంలో కోంత వ్యాక్సీన్ రవాణాతో పాటు నిల్వలోనూ వృధా కానుంది, 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వెయ్యాలంటే ఎన్ని డోసులు అవసరమవుతాయో వేస్టేజ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ (డబ్ల్యూఎంఎఫ్) ద్వారా ఆరోగ్య శాఖ నిపుణులు లెక్కించారు. 10 శాతం వృథా పోవచ్చని అంచనా వేశారు.

ఆ లెక్కన డబ్ల్యూఎంఎఫ్ 1.11గా ఉండొచ్చని తేల్చారు. అంటే ఒక్కొక్కరికి వ్యాక్సిన్ వేయాలంటే 2.22 డోసులు అవసరమవుతాయని లెక్కగట్టారు. మొత్తంగా 30 కోట్ల మందికి 66.6 కోట్ల డోసులు కావాలని తేల్చారు.ఆ లెక్క ప్రకారమే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలు ఇచ్చారు. బ్లాక్, మండలం, జిల్లాల వారీగా ఎన్ని డోసులు కావాలో చెప్పాలని పేర్కొన్నారు. వీలైనంత వరకు వృథాను తగ్గించాలని సూచించారు. కాగా, యూనివర్సల్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ (యూఐపీ) కింద కేంద్రం కరోనా వ్యాక్సిన్లను కొనుగోలు చేయనుంది. వ్యాక్సిన్ వేస్టేజ్ ను తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vaccines  Universal Immunisation Programme  Doses  covid-19 vaccine  covid-19  Cold Chain  

Other Articles