'NDA came back through chor darwaza': Tejashwi Yadav పోస్టల్ బ్యాలెట్ రీకౌంటింగ్ కు తేజస్వీ డిమాండ్

Tejashwi yadav raises doubts over bihar results demands postal ballot recount

Tejashwi Yadav, Chief Minister Nitish Kumar, Bihar assembly election 2020,Bihar election news,bihar election 2020 live updates,bihar election news live updates,bihar assembly election live news, election meeting, BJP JDU coalition, Muzaffarpur, Bihar, Politics

RJD leader Tejashwi Yadav accused Bihar CM Nitish Kumar of coming back to power through 'chor darwaza' (backdoor) and raised doubts over the electoral process in the state. Tejashwi appeared to allege fraud in postal ballot count and demanded recount in 20 seats where Mahagathbandhan candidates lost by a marginal number of votes.

ఆర్జేడీని వెన్నాడిన దురదృష్టం.. పోస్టల్ బ్యాలెట్ రీకౌంటింగ్ కు తేజస్వీ డిమాండ్

Posted: 11/13/2020 03:48 PM IST
Tejashwi yadav raises doubts over bihar results demands postal ballot recount

(Image source from: Twitter.com/ANI)

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన ఆర్జేడీని నిజంగా దురదృష్టం వెంటాడింది. 243 స్థానాలు కలిగిన అసెంబ్లీలో 75 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మరో స్వల్ప శ్రమోర్చిన పక్షంలో విజయం తమదై వుండేది. కేవలం 13 వందల ఓట్లతో అధికారం చేజారిపోవడంతో ఆయన పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి పగ్గాలను నితీశ్ కుమార్ అందుకున్నా.. ప్రజల హృదయాలలో మాత్రం తామే వుంటామని అన్నారు. మూడు పర్యాయాలు సీఎం, రెండుసార్లు పీఎం అయిన ప్రధాని నరేంద్రమోడీ.. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి అయిన నితీశ్ కుమార్ లు ఈ ఎన్నికలలో ధనబలం, కండబలంతో పాటు అనేక ఎత్తుగడలు వేసినా.. 31 ఏళ్ల యువకుడిని ఆపలేకపోయారని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో అర్జేడీని అతిపెద్ద పార్టీగా అవతరించకుండా అపలేకపోయారని ఆయన పేర్కోన్నారు, సీఎం నితీష్ జనాకర్షణ ఎక్కడికి పోయిందో తెలియడం లేదని.. ఆ పార్టీ మూడవ స్థానానికి పరిమితం అయ్యిందని విమర్శించారు. బీహార్ ముఖ్యమంత్రి పీఠంపై నితీష్ కూర్చునా.. బీహార్ ప్రజల హృదయాలలో మాత్రం తామే వుంటామని.. అందుకు ప్రజలకు తాము నిత్యం కృతజ్ఞతో వారికి కావాల్సిన సేవలను, వారి పక్షాన వుంటూ పోరాడుతామని అన్నారు. బిహార్ అసెంబ్లీ పోరులో ఎన్డీయేకు ఎంజీబికి మధ్య కేవలం 12720 ఓట్ల తేడా మాత్రమే వుందని తెలిపారు. ఈ 12 వేల ఓట్లతోనే ఎన్డీయే 15 స్థానాల్లో గెలుపోందారని, అత్యల్ప ఓట్ల తేడాతో తాము ఏకంగా 20 స్థానాలను కోల్పోయామన్నారు.

తమకు అధికంగా ఓట్లు వచ్చిన ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ లను రద్దు చేశారని.. ఇంత భారీ సంఖ్యలో ఓట్లను ఎవరి ఒత్తిడితో రద్దు చేసి.. ఎవర్ని గెలిపించేందుకు కుట్ర జరిగిందో ప్రజలకు తెలుసునని అరోపించారు. అయినా నితీశ్ పార్టీ మాత్రం మూడో స్థానానికి పరిమితం అయ్యిందని.. ఇప్పుడు నితీశ్ తన సీఎం పీఠాన్ని వద్దనుకుంటారా..? అని తేజస్వి చురకలంటించారు, తమ అభ్యర్థులు 20 చోట్ల స్వల్ప వ్యవధితోనే ఓడిపోయారని, పోస్టల్‌ బ్యాలెట్లను రీకౌంటింగ్ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా మద్దతు పొందలేకపోయిన నీతీశ్‌ దొడ్డిదారిన సీఎం పీఠాన్ని ఎక్కాలని భావిస్తున్నారని తేజస్వీ యాదవ్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles