Arnab Goswami bail plea rejected by HC అర్నాబ్ గోస్వామి బెయిల్ నిరాకరించిన హైకోర్టు

Bombay high court rejects arnab goswami interim bail plea

Arnab Goswami,Bombay High Court, Republic TV, Editor-in-Chief, judicial custody, architect Anvay Naik, non-payment of duesm abetment to suicide case, Arnab Goswami interim bail plea, N M Joshi Marg police station, Maharashtra, crime

Bombay High Court has rejected the interim application in Arnab Goswami's illegal arrest case. Along with Arnab, the interim bail of Firoj and Nitish were rejected. Arnab had sought to quash the abetment to suicide case filed against him.

అర్నాబ్ గోస్వామి బెయిల్ నిరాకరించిన హైకోర్టు

Posted: 11/09/2020 10:28 PM IST
Bombay high court rejects arnab goswami interim bail plea

రిపబ్లిక్ టీవీ సీఈఓ, ఎండీ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటీషన్ ను ఇవాళ మరోమారు కోర్టు ఎదుట విచారణకు రాగా రాష్ట్రోన్నత న్యాయస్థానం దానిని కొట్టివేసింది. వరుసగా నాల్గవ రోజు న్యాయస్థానం అర్నబ్ గోస్వామి బెయిల్ పిటీషన్ పై విచారణ జరపినా చివరకు ఆయనకు చుక్కెదురైంది. 2018లో అర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్ అతని తల్లి కుముద్ ఆత్మహత్యలకు పాల్పడటానికి ఆయనే ప్రేరేపించారన్న అభియోగాలను ఎదుర్కన్న ముగ్గురిలో ప్రధాన నిందితుడైన అర్నబ్ గోస్వామి పోలీసులు గత బుధవారం అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

కాగా ఈ కేసుతో తనకు సంబంధం లేదని, రెండేళ్ల కిత్రం కేసును మహారాష్ట్రలోని శివసేన కూటమి ప్రభుత్వం తిరగతోడి తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ కేసును దర్యాప్తు చేస్తుందని ఆయన అరోపించారు. తన అరెస్టు అక్రమం అని దీనిని నుంచి తనకు విముక్తి కల్పించాలని ఆయన మహరాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయనతో పాటు మరో ఇద్దరు నిందితుల వాదనలను కూడా వినింది. అటు ప్రభుత్వం, ఇటు బాధితురాలు, పోలీసుల వాదనలను కూడా విన్న న్యాయస్థానం ఆయన పెట్టుకున్న మధ్యంతర బెయిలు పిటీషన్ పై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవాళ కోట్టివేసింది.

అయితే, కేసును ప్రాథమికంగా విచారించిన కింది కోర్టులోనే బెయిల్ పిటిషన్ ను దాఖలు చేయాలని పేర్కోంది. దీంతో అలిబాగ్ లోని సెషన్స్ కోర్టులో అర్నబ్ గోస్వామి తరపు న్యాయవాది ఆయన బెయిల్ పిటీషన్ ను దాఖలు చేశారు, ఈ పిటీషన్ త్వరలోనే విచారణకు రానుంది. మరోవైపు, కాగా గత బుధవారం రోజున అరెస్టైన అర్నబ్ గోస్వామికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో అర్నాబ్ రాయ్ గడలోని కోవిడ్ కేంద్రంగా మార్చిన జిల్లా పరిషత్ పాఠశాలలో జైలు అధికారుల పర్యవేక్షణలో వుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్నాడని గుర్తించిన పోలీసులు ఆయనను తలోజా జైలుకు తరలించారు, ఇతరలు ఫోన్ నుంచి తన సోషల్ మీడియాలోకి లాగిన్ అయిన అర్నబ్ రెండు గంటల పాటు యాక్టివ్ గా వున్నారని సమాచారం.

హోం మంత్రితో గవర్నర్ చర్చలు..

 

రిపబ్లిక్ టీవి జర్నలిస్టు, ఎండీ అర్నబ్ గోస్వామి జైల్లో హింసకు గురి చేస్తున్నారని, కుటుంబ సభ్యులను కూడా కలవనీయడం లేదని తానే స్వయంగా అరోపించిన నేపథ్యంలో ఈ విషయంలో ఏకంగా మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఈ అంశంపై స్పందించారు. మహారాష్ట్ర హోంమంత్రితో ఈ ఉదయం గవర్నర్ అర్నబ్ గోస్వామి మాట్లాడారు. ఈ సందర్భంగా అర్నాబ్ గోస్వామి రక్షణ, ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. అర్నాబ్ ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులను అనుమతించాలని కోరారు.

అలీబాగ్ జైలు క్వారంటైన్ సెంటర్లో ఉన్న అర్నాబ్ మొబైల్ ఫోన్ వాడుతున్నారనే కారణాలతో ఆయనను అక్కడి నుంచి తలోజా జైలుకు ఆదివారం ఉదయం తరలించారు. పోలీసు వాహనంలో తరలిస్తుండగా అర్నాబ్ వాహనాన్ని చుట్టుముట్టిన మీడియాను ఉద్దేశించి గట్టిగా అరుస్తూ... తన జీవితం ప్రమాదంలో ఉందని అన్నారు. తన లాయర్ తో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని చెప్పారు. జైలర్ తన పట్ల దారుణంగా ప్రవర్తించారని అన్నారు. అంతటితో ఆగకుండా తనపై అలిబాగ్ జైలర్ దాడి కూడా చేశారని, తనను రక్షించాలని కూడా వేడుకున్నారు. అయితే ఈ అరోపణలన్నీ అవాస్తవాలని.. కోవిడ్ క్వారంటైన్ కేంద్రంలో తనపై ఎవరైనా ఎలా దాడి చేస్తారని జైలు అధికారులు ప్రశ్నించారు. ఒకవేళ అలాంటిదే జరిగితే అక్కడి సిసిటీవీ ఫూటేజీలలో అంతా నిక్షిప్తమైవుంటుందని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh