(Image source from: Zeenews.india.com)
రిపబ్లిక్ టీవీ సీఈఓ అర్నాబ్ గోస్వామి బెయిల్ పిటీషన్ పై వరుసగా మూడవ రోజు న్యాయస్థానం విచారించనుంది. 2018లో అర్కిటెక్ట్ సహా అతని తల్లి ఆత్మహత్యలు చేసుకున్న కేసులో అభియోగాలను ఎదుర్కన్న అర్నబ్ గోస్వామి అరెస్టై రెండు రోజులు కావస్తున్నా ఇప్పటికీ అతని ఊరట లభించలేదు, మధ్యంతర బెయిలు కోసం ఆయన పెట్టుకున్న పిటీషన్ ను క్రితం రోజున విచారించిన బాంబే హైకోర్టు సమయాభావం వల్ల ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ అర్నబ్ బెయిల్ పిటీషన్ పై విచారణను కోనసాగిస్తూ ఈ కేసులో ఇతర పార్టీల వాదనలను వినే అవకాశం వుంది. క్రితం రోజున అసంపూర్తిగా ముగిసిన వాదనలు ఇవాళ కకొనసాగనున్నాయి.
జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎంఎస్ కర్ణిక్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసులను విచారించనుంది, ప్రతివాది, రాష్ట్రప్రభుత్వం, అన్వయ్ నాయక్ కుటుంబ సభ్యుల పిటిషన్లతో పాటు వారి వాదనలను కూడా న్యాయస్థానం విననుంది. గత ప్రభుత్వం ఈ కేసును మూసివేసినప్పటికీ, బాధిత కుటుంబ సభ్యుల అభ్యర్థనతో ఉద్ధవ్ ప్రభుత్వం కేసును తిరిగి తెరిచింది. అర్నాబ్ ను బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కోర్టులో హాజరు పరచగా, 14 రోజుల రిమాండ్ విధించింది. అర్నాబ్ ప్రస్తుతం కోవిడ్ కేంద్రంగా మార్చిన రాయ్ గడ్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నారు. అయితే బుధవారం రోజునే ఆయన న్యాయస్థానంలో బెయిల్ పిటీషన్ వేయగా.. బాధితురాలి వాదనలు వినకుండా.. బెయిలు ఇవ్వమిన న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఆర్కిటెక్చర్-ఇంటీరియర్ డిజైనర్ అయిన అన్వయ్ నాయక్.. అర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ ఛానెల్ కు సంబంధించి ఇంటీరియర్ డిజైనింగ్ పనులు చేసిన తరువాత అతడికి డబ్బులు ఇవ్వకుండా వేధించడంతో ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనతో పాటు ఆయన తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు, అయితే ఈ కేసులను గత బీజేపి ప్రభుత్వం తొక్కిపెట్టగా, ప్రస్తుతం మహారాష్ట్రలోని శివసేన కూటమి ప్రభుత్వం ఈ కేసును పునర్విచారించింది. దీంతో అర్నబ్ గోస్వామిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కాగా అర్నాబ్ అరెస్ట్ సందర్భంగా బయటకు వచ్చిన 13 నిమిషాల నిడివి ఉన్న వీడియోలో తమతో సహకరించాల్సిందిగా పోలీసులు పలుమార్లు అర్నాబ్‌ను కోరడం అందులో కనిపించింది.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more