Bharat Biotech to launch Covaxin in Q2 2021 వచ్చే ఏడాది జూన్ నాటికి కరోనా వాక్సీన్: భారత్ బయోటెక్

Coronavirus vaccine update bharat biotech plans mid 2021 launch for covaxin

Coronavirus vaccine, Coronavirus vaccine update, Coronavirus vaccine in India, Bharat Biotech covaxin price,Bharat Biotech covaxin launch 2021 q2,Bharat Biotech covaxin launch,bharat biotech covaxin,Bharat BiotechCoronavirus vaccine update India, COVID19 vaccine, COVID19 vaccine news, COVID19 vaccine India, COVID19 vaccine update, COVID19 vaccine progress, COVID19 vaccine name

Bharat Biotech, which is developing India's indigenous coronavirus vaccine, is planning to launch the vaccine in the second quarter of 2021 if it gets the approval from regulatory authorities, a company executive told.

వచ్చే ఏడాది జూన్ నాటికి కరోనా వాక్సీన్: భారత్ బయోటెక్

Posted: 11/02/2020 10:27 PM IST
Coronavirus vaccine update bharat biotech plans mid 2021 launch for covaxin

(Image source from: Hwnews.in)

యావత్ మానవాళిపై ప్రభావం చూపుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు భారత్ సహా పలు దేశాలు ఇప్పటికే వాక్సీన్ తయారీలో నిమగ్నమయ్యాయి, ఇప్పటికే పలు దేశాల్లో సెకెండ్ వేవ్ కూడా ఉద్దృతం అవుతుండగా, పది నెలలు కావస్తున్నా ఇంకా కరోనాకు ఇప్పటికే సైడ్ ఎఫెక్ట్స్ లేని వాక్సీన్ అందుబాటులోకి రాకపోవడంతో అందోళన కొనసాగుతూనే వుంది. అయితే కొన్ని వాక్సీన్ లు వచ్చినా వాటి సైడ్ ఎపెక్ట్స్ చాలా వుండగా, పలు వాక్సీన్ మాత్రం కరోనా నియంత్రణను ఎదుర్కోలేక డీలా పడ్డాయి. దీంతో నాణ్యతతో కూడిన వాక్సీన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూపులు కొనసాగుతూనే వున్నాయి. అయితే భారత్ లో అభివృద్ధి చెందుతున్న భారత్ బయోటెక్ మాత్రం శుభవార్తను తెలిపింది.

వచ్చే ఏడాది రెండో త్రైమాసికం లోపు లేదా జూన్ నెలనాటికి కరోనా మహమ్మారిని ఎదుర్కోందుకు నాణ్యతతో కూడిన టీకాకు తాము ప్రపంచం అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంస్థ అంతర్జాతీయ వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాల్లో 25 నుంచి 30 కేంద్రాల్లో మూడవ దశ హ్యూమన్ ట్రయల్స్ పరీక్షలను జరిపించనున్నామని తెలిపారు. అయితే ఈ పరీక్షల కోసం ఒక్కో కేంద్రంలో 2 వేల మంది వాలెంటీర్లను నియమించుకున్నామని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఈ దశ ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసిన తరువాత డ్రగ్ కంట్రోలర్ అధారిటీ అఫ్ ఇండియా నుంచి అనుమితి లభించిన తరువాత 2021 రెండో త్రైమాసికంలో వ్యాక్సిన్ బయటకు వస్తుందని స్పష్టం చేశారు.  వ్యాక్సిన్ ను పెద్ద మొత్తంలో సిద్థం చేసేందుకు రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నామని ఆయన స్పష్టం చేశారు, ప్రభుత్వంతో పాటు ప్రైవేటు కంపెనీలకు కూడా టీకాను అందిస్తామని తెలిపారు. టీకా ఎగుమతి విషయంలో పలు దేశాల ఫార్మా కంపెనీలతో ప్రస్తుతం ప్రాథమిక చర్చలు సాగుతున్నాయని తెలిపారు. అయితే, టీకా ఎగుమతి విషయమై ఇప్పటివరకూ ఎటువంటి నిర్ణయాలనూ తమ సంస్థ తీసుకోలేదని సాయి ప్రసాద్ స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles