Nayani last rites performed with full state honor నాయిని అంతిమ సంస్కారాలు పూర్తి

Former home minister nayani narasimha reddy performed the last rites with full state honor

Nayani Narasimha Reddy Death, Nayani Narasimha Reddy Funeral, Telangana first Home Minister, Mahaprasthanam, KTR Condolenses, Telangana Ministers, KCR, Nayani Narasimha Reddy Passed Away, Nayani Narasimha Reddy Dead

Telangana's first Home Minister Nayanai Narsaima Reddy was transported to the fire in the Mahaprasthanam funeral home here with state honors. A large crowd of people arrived at the cemetery with his body. Nayani's son Devender Reddy fired the pier after the police fired three rounds in to the air as a mark of honor to the departed leader.

తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంతిమ సంస్కారాలు పూర్తి

Posted: 10/22/2020 09:24 PM IST
Former home minister nayani narasimha reddy performed the last rites with full state honor

కార్మికనేత, ఉద్యమ యోధుడు, కార్మిక జనపక్షపాతి, తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అంతిమ సంస్కారాలు ముగిసాయి. కరోనా నిబంధనల మధ్య పరిమిత సంఖ్యలోనే బంధువులు, అనుయాయువులు, కార్మిక సంఘ నేతలు, టీఆర్ఎస్ పార్టీ ప్రముఖులు, మంత్రులు, కుటుంబసభ్యులు మధ్య ఆయన దహన సంస్కారాలు ముగిసాయి, జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో రాష్ట్రప్రభుత్వం అధికార లాంచనాల మధ్య ఆయనకు తన బౌతికకాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నాయిని నర్సింహారెడ్డి అంతిమ సంస్కారాల్లో పాల్గోన్న మంత్రి కేటీఆర్.. ఆయన పాడెను కూడా తన భుజాలపై మోసి.. ఆయన పట్ల వున్న ప్రేమను చాటుకున్నారు.

అంతకుముందు బజారాహిల్స్ లోని రోడ్డు నెంబరు 12 నుంచి ఫిల్మ్ నగర్ మీదుగా మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ లు పాల్గోని ఆయన పాడెను మోసారు, ఈ అంతిమయాత్రలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్, మహమూద్ అలి, సబితా ఇంద్రారెడ్డి, పార్లమెంటరీ సభ్యుడు కేశవరావు, నగర మేయర్ బొంతు రామ్మెహన్ పలువురు కార్పోరేటర్లు పాల్గోన్నారు. అంతిమ సంస్కారాల సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా గాలిలోకి కాల్పులు జరిపారు. అంతక్రియలకు హాజరైన నేతలు నాయిని నర్సింహారెడ్డితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

నాయిని నర్సింహారెడ్డి తీవ్ర అస్వస్థతతో గత అర్ధరాత్రి మృతి చెందారు. ఇటీవలే కరోనా బారినపడి కోలుకున్న ఆయన, ఆ తర్వాత శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోన్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఈ నెల 13న ఆయనను హుటాహుటిన అపోలో అసుపత్రికి తరలించిచారు. అయితే న్యూమోనియా బారిన పడ్డారని పరీక్షల ద్వారా తెలుసుకున్న వైద్యులు ఎక్యూట్ ఐసీయూలోకి తరలించి వెంటిలేటర్ పై పెట్టి చికిత్స అందించారు. అయితే క్రమంగా ఆయన అరోగ్యపరిస్థితి విషమిస్తూ రావడంతో ఆయన కుటుంబసభ్యులు అందోళనకు గురయ్యారు. అంతా భయపడినట్టే నిన్న సీఎం కేసీఆర్ పరామర్శించిన తరువాత ఇవాళ వేకువ జామున ఆయన పరమపదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles