Historic temple urn destructed for hidden treasure గుప్తనిధుల వేట: చారిత్రక దేవాలయ కలశం ధ్వంసం

Historic temple urn destructed for hidden treasure in prakasham district

Tarlupadu, Historic Temple, Veerabhadra temple, Hidden Treasure, temple urn destructed, unknown assailants, prakasham district, Andhra pradesh, Crime

Temples distruction and charriots burning incidents are on at large in the Andhra Pradesh state. Now Hunting for Hidden Treasure underneath the temples has been taken place and the historic temples urn are destructed by the unknown assailants in Tarlupadu of prakasham district.

గుప్తనిధుల వేట: చారిత్రక దేవాలయ కలశం ధ్వంసం

Posted: 10/20/2020 09:39 AM IST
Historic temple urn destructed for hidden treasure in prakasham district

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై ముప్పేట దాడి కోనసాగుతోంది. ఓ వైపు చారిత్రక ప్రాముఖ్యత కలిగి వున్న దేవాలయాలోని రధాల విధ్వంసం కొనసాగాని.. మరోవైపు దేవాలయ భూముల అన్యక్రాంతం జరగుతున్న నేపథ్యంలోనే మరో రకంగానూ ఆలయాలపై దాడి కొనసాగుతోంది. దేవాలయాల నిర్మాణ సమయంలో వాటి కింద నిధిని దాచిపెట్టి వుంటారని భావించిన గుర్తుతెలియని వ్యక్తులు దేవాలయాల విధ్వంసానికి పాల్పడి మరీ నిధుల కోసం వేటాడుతున్నారు. ఈ ఘటన తాజాగా ప్రకాశం  జిల్లా  తర్లుపాడులో జరిగింది. శతాబ్దాల చరిత్ర కలిగిన పురాతన ఆలయాలు విష్టతను భావితరాలకు అందకుండా.. గుప్తునిధులతో తాము మాత్రమే కుబేరులం కావాలన్ని స్వార్థచింతనతో ఈ దాడులు జరుగుతున్నాయి.

తర్లపాడులోని చారిత్రక శ్రీ వీరభద్రస్వామి ఆలయ కలశాన్ని గుర్తుతెలియని దొంగులు ధ్వంసం చేసి గుప్త నిధుల కోసం అన్వేషించడం తీవ్ర దుమారం రేపింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది, ఈ ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఘటనకు పాల్పడ్డారని అన్నారు, ఈ గుర్తుతెలియని దుండగులు.. ఆలయ గోపురంపై ఉన్న కలశానికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి మరీ, చుట్టూ ఉన్న కాంక్రీట్ ను పగలగొట్టి, కలశాన్ని తొలగించారని ఆయన తెలిపారు. స్థానిక సీఐలు తర్లపాడులోని ఘటనాస్థలాన్ని సందర్శించారని, దుండగుల ఆధారాల కోసం కూడా క్లూస్ టీం అన్వేషిస్తోందని.. వారిని పట్టుకునేందుకు పోలీసు బృందాలు కూడా రంగంలోకి దిగాయని తెలిపారు.

ఆలయ కలశాన్ని ప్రతిష్ఠించిన వేళ, శతాబ్దాల క్రితం కలశాల కింద ఏమైనా నిధిని దాచివుంచితే దానిని సొంత చేసుకునేందుకు దుండగులు ఈ కార్యకానికి పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు, శతాబ్దాల క్రితం ఆలయంలో భక్తులు అంతంతమాత్రంగా వుంటారని తెలిపిన వ్యక్తులే ఈ పనికి పాల్పడివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు, ఈ ఆలయం గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న దోంగలు ఈ పనికి పాల్పడివుంటారని .. దీంతో వీరి స్థానికులయ్యే అవకాశం కూడా వుందన్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు కొనసాగతొంది. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని జిల్లా ఎస్సీ తెలిపారు.

తర్లుపాడులోని శతాబ్ధాల పురాతనమైన దేవాలయంగా.. చారిత్రక నేపథ్యంమున్న వీరభద్రస్వామి దేవాలయం  చాలా విశిష్టమైనది. ప్రతీ ఏటా ఈ ఆలయంగో అంగరంగవైభవంగా ఉత్సవాలు జరుగుతాయి, ఈ ఉత్సవాలకు ప్రకాశం జిల్లాతో పాటు కర్నూలు, గుంటూరు సహా పలు ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్దఎత్తున విచ్చేసి మూలవిరాట్ ను దర్శించుకుంటారు, ఈ నేపథ్యంలో ఆలయ కలశం ధ్వంసమైందన్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న స్థానిక బీజేపీ నేతలు ధర్నాకు దిగారు, దీంతో తర్లపాడులో స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారుల నుంచి హామీ లభించిన తరువాత, పరిస్థితి సద్దుమణిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh