Brahmotsavam: Malayappa Swamy on Chinna Sesha Vahanam చిన్నశేషవాహనంపై తిరుమల శ్రీవారు..

Tirumala brahmotsavam lord malayappa swamy taken in procession on chinna sesha vahanam

Tirumala Tirupati devastanam, Lord malayappa swamy as Damodar Krishna, Lord Malayappa swamy on Chinna Shesha Vahanam, Lord Malayappa swamy on Hamsa Vahanam, Lord Malayappa Swamy, Tirumala Tirupati Devasthanam, Tirumala Bramhotsavam, chinna shesha vahanam, Hamsa vahanam, covid-19, devotees

Tirumala diety Lord Malayappa Swamy, dressed in celestial attire of 'Damodar Krishna', was taken in a procession on Chinna Sesha Vahanam, on the Second day of Srivari Navaratri Brabmotsavam on saturday.

చిన్నశేషవాహనంపై తిరుమల శ్రీవారు.. రాత్రి హంసవాహనుడై..

Posted: 10/18/2020 01:05 AM IST
Tirumala brahmotsavam lord malayappa swamy taken in procession on chinna sesha vahanam

(Image source from: news.tirumala.org)

తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో రెండో రోజు ఉదయం మలయప్పస్వామి ఐదు తలల చిన శేషవాహనంపై విహరించారు. నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అవతారంలో భక్తులను అభయప్రదానం చేశారు. ఓ చేతిలో భూమి ఆకారంలో వున్న వెన్నతో మరో చేతిలో పిల్లనగ్రోవితో భక్తులకు కొంగుబంగారమైన శ్రీవారు.. శ్రీకృష్ణుడి అవతారంలో దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు.

ప్రతీఏడు కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్ర తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజన సందోహానికి అభయప్రధానం చేసే శ్రీవారు ఈ సారి కరోనా నేపథ్యంలో ఆలయానికి మాత్రమే ఉత్సవాలు పరిమితమయ్యాయి, ఇవాళ రాతి్ర బ్రహోత్సవాలలో భాగంగా తిరుమల దేవదేవుడు హంసవాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. పెద్దశేష వాహనం ఆదిశేషుడైతే, చిన శేషవాహనం వాసుకిగా భావన. చిన శేషవాహనంపై కొలువైన స్వామిని పూజిస్తే కుండలిని యోగసిద్ది కలుగుతుందని భక్తుల విశ్వాసం. తితిదే ఈవో జవహర్‌రెడ్డి, అర్చకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles