Kavitha Wins Nizamabad MLC polls నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలుపు..

Trs contestant kavitha emerges victorious in nizamabad mlc polls

Telangana Rashtra Samithi, Kalvakuntla Kavitha, former Nizamabad MP, byelection, Nizamabad Local Body MLC, LaxmiNarayana, Subash Reddy, Telangana, politics

Telangana Rashtra Samithi contestant, former Nizamabad MP Kalvakuntla Kavitha clinched the victory in the recently held byelection to the Nizamabad Local Body Constituency (MLC) elections. According to the sources, TRS party secured 728 votes out of total 823 votes in the constituency.

నిజామాబాద్ ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గెలుపు..

Posted: 10/13/2020 09:15 AM IST
Trs contestant kavitha emerges victorious in nizamabad mlc polls

(Image source from: Twitter.com/RaoKavitha)

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల‍్వకుంట్ల కవిత విజయ దుందుభి మోగించారు.  నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ రోజు నిర్వహించిన కౌంటింగ్ లో టీఆర్ఎస్‌కు 728 ఓట్లు, బీజేపీకి 56 ఓట్లు, కాంగ్రెస్‌కు 29 ఓట్లు రాగా, చెల్లని ఓట్లు 10గా నమోదయ్యాయి. మొత్తం 823 ఓట్లు పోలయ్యాయి. దీంతో భారీ ఆధిక్యంతో కవిత విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సుభాష్‌రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ పోటీ  చేసి డిపాజిట్లను కూడా సాధించలేక బొల్తా పడ్డారు. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ పదవికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలతోనే అధిక సంఖ్యలో వున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఓట్లతో అమె విజయం లాంఛనమే అయినా.. బీజేపి, కాంగ్రెస్ పార్టీలు మాత్రం అమె విజయాన్ని తుదివరకు ఉత్కంఠగా మార్చాయి.

టీఆర్‌ఎస్ అభ్యర్థి కవిత‌ గెలుపుతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ మిఠాయిలు పంచుకుంటున్నారు. ఆమె గెలుపుతో టీఆర్ఎస్ శ్రేణులు ఆనందంలో మునిగిపోయాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తన గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఎంతో కష్టపడ్డారని తెలిపారు. మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అబద్ధపు మాటలు చెప్పి బీజేపీ నేతలు మోసం చేశారని... అయినా ఎవరూ వారిని నమ్మలేదని అన్నారు. విపక్షాల అబద్ధాలకు బదులుగా కవితకు విజయాన్ని కట్టబెట్టారని చెప్పారు. మరోసారి న్యాయం గెలిచిందని అన్నారు.

ఈ ఎన్నికలో గెలిచిన కల్వకుంట్ల కవిత ఈ నెల 14న కవిత ఎమ్మెల్సీగా ప్రమాణం చేయనున్నారు. తన సోదరి కవిత ఎమ్మెల్సీగా నెగ్గడం పట్ల మంత్రి కేటీఆర్ స్పందించారు. మెనీ కంగ్రాచ్యులేషన్స్ కవితా అంటూ ట్వీట్ చేశారు. తిరుగులేని విజయం సాధించావంటూ చెల్లిని అభినందించారు. కవిత విజయానికి కృషి చేసిన నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ శ్రేణులను మెచ్చుకున్నారు. టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా విభాగాన్ని ఈ ఎన్నికల కోసం సమర్థవంతంగా నడిపించారంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు సైతం ఎంతో సమన్వయంతో పాటుపడ్డారని కొనియాడారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles