Gold and silver rates today hike in Vizag and Hyderabad అంతర్జాతీయంగా దిగివస్తున్న బంగారం ధరలు..

Gold price today yellow metal down nearly 1 support seen at rs 49 800

gold rate today, HDFC Securities, Gold, mcx, Bullion market, silver, federal reserve, gold price today, SPDR Gold Trust, United States dollar

Gold rates have been on a surge for last three days and continued the same trend on Monday. On MCX, the gold rates have surged by Rs. 10 to Rs. 52,100 while the silver increased by Rs. 10 to Rs. 61,200. The gold rates have increased inline with global markets where the investors eyed to catch up the profits with US stimulus bill.

అంతర్జాతీయంగా దిగివస్తున్న బంగారం ధరలు.. రూ. యాభై వేల దిగువకు..

Posted: 10/05/2020 06:08 PM IST
Gold price today yellow metal down nearly 1 support seen at rs 49 800

అంతర్జాతీయంగా బంగారం ధరల పతనం కొనసాగుతోంది. అటు క్రూడ్ అయిల్ తో పాటు ఇటు అమెరికా డాలర్ క్రమంగా బలాన్ని పుంజుకోవడంతో బంగారం వెలవెలబోతోంది. డాలరపై పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపడంతో ఇటు బంగారంపై పెట్టిన పెట్టుబడుల అమ్మకాలకు మొగ్గచూపుతున్న కారణంగా అంతర్జాతీయంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి, ఇక దీనికి తోడు అటు స్టాక్ మార్కెట్లు కూడా కరోనా తరువాతి కాలంలో కాసింత నెమ్మెందిగా వేగాన్ని అందుకుంటున్న క్రమంలో మదుపరులు తమ పెట్టుబడులను లాభాల వైపు మళ్లిస్తున్నారని నిపుణులు వేస్తున్నారు, దీంతో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడ్డుతున్నాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో పది గ్రాముల బంగారం ధర గత కొంతకాలంగా రూ. 50 వేల దిగువన కోనసాగుతోంది. ఎంసీఎక్స్ లో డిసెంబర్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాముల బంగారానికి రూ. 510 పతనమై రూ. 50,060లకు చేరగా.. వెండి కూడా అదే బాటలో పయనించింది, వెండి ధర కిలోకు రూ.676 పడిపోయి రూ. 60,469 వద్దకు చేరుకుంది. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లలోనూ ధరలు స్వల్పంగా పడిపోయాయి. న్యూయార్క్ కామెక్స్ లో ఔన్సు బంగారం ధర 0.5 శాతం నష్టంతో 1,898 డాలర్లకు చేరగా, స్పాట్ మార్కెట్లో 0.4 శాతం మేరకు ధర తగ్గి 1,893 డాలర్లకు చేరుకుంది. వెండి ధర కూడా అదే దారిలో పయనించి 0.45 శాతం పడిపోయి 23.93 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.  

ఇక ప్రపంచంలోనే రెండో అతిపెద్ద బంగారం కనుగోలుదారుగా అవతరించిన భారత్ దేశంలో లోని వివిధ రాష్ట్రాలు, నగరాల్లో బంగారం ధరలు ఒక్కో విధంగా వున్నాయి, ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రాల పన్నులు, మేకింగ్ చార్జులలో వత్యాసం బంగారు ధరలపై కూడా ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో 24 కారెట్ల పది గ్రాములు బంగారం ధర రూ.52,910గా నమోదు కాగా, 22 కారెట్ల పదిగ్రామాలు బంగారం ధర రూ.48,510గా నమోదైంది, ఇక సామాన్యుల ఆభరణం వెండి కూడా అదే బాటలలో రూ.61210గా నమోదైంది, ఇదే సమయంలో విశాఖపట్నంలోనూ బంగారం వెండి ధరలు హైదరాబాద్ తో సరిసమానంగా నమోదయ్యాయి. అయితే కేరళలో మాత్రం వీటి ధరల్లో వత్యాసం కనిపించింది, 24 కారెట్ల బంగారం ధర రూ. 50960గా, 22 కారెట్ల బంగారం ధర రూ.46719గా నమోదుకాగా, వెండి ధరలో మాత్రం మార్పు లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles