Actor Sonu Sood honoured by UNDP ప్రియాంక చోప్రా, హాలీవుడ్ స్టార్స్ సరసన సోనూ సూద్..

Sonu sood receives sdg special humanitarian action award by undp

United Nations, Migrant workers, Lockdown, Coronavirus, Covid-19 news, Articles, Sustainable development, Economy, United Nations, Sood, Sustainable Development Goals, United Nations Development Programme, Sonu, Actor, Leonardo DiCaprio, Priyanka Chopra, Emma Watson

Actor Sonu Sood who is often dubbed as the 'messiah of migrants' for his philanthropic work during coronavirus induced lockdown, has been conferred with the prestigious SDG Special Humanitarian Action Award by the United Nations Development Programme (UNDP).

ప్రియాంక చోప్రా, హాలీవుడ్ స్టార్స్ సరసన సోనూ సూద్..

Posted: 09/30/2020 09:28 AM IST
Sonu sood receives sdg special humanitarian action award by undp

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచంపై తన ప్రభావాన్ని చూపి ఎంతో మందికి కనీసం తినేందుకు మెతుకు కూడా లేకుండా చేసింది. ఈ క్రమంలో పలు మారుమూల ప్రాంతాల్లో పేద పిల్లలు అన్నం లేక ఇసుకను అన్నంగా తిన్నారన్న కథనాలను కూడా చూసిన దేశం చలించిపోయింది. ఈ కథనాలతో కదిలాడో లేక కళ్లారా చూశాడో కానీ.. ఇలాంటి వార్తలను వింటూ మనస్సున్న మనిషి ఆగలేడు. తనలోని సేవాగుణం, సాయం చేయాలన్న దృక్పథం తన్నకుంటూ వచ్చేస్తోంది. అదే అప్పటి వరకు కొంతమంది సినీ అభిమానులకు, సినిమా స్టార్లకు మాత్రమే తెలిసిన సినీనటుడు సోనూ సూద్ ను మా వాడంటే మావాడని పార్టీలు వాదించుకునేలా చేసింది.

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ స‌మ‌యంలో రియ‌ల్ హీరోగా నిలిచిన సోనూ సూద్ పేదలను, వలస కార్మికులను అదుకున్నాడు. ఏ ప్రతిఫలం లేకుండా ఆయన అందించిన సాయం వలస కార్మికులను తమ స్వగ్రామాలకు చేర్చింది. తమ వారితో కలసి కలో గంజో తాగేట్లు చేసింది. ఆయన చేసిన సేవలను ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి గుర్తించి ఆయనకు అరుదైన పుర‌స్కారాన్ని ప్రకటించింది. దీంతో ఒక రకంగా అటు కేంద్రంలోని ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కానీ.. తాము ప్రజల కోసం వున్నామన్ని అందుకనే అధికారంలో వున్నామని చెబుతున్న విషయాలు అంతా ప్రచారం కోసమేనని, నిజానికి వారు ప్రజలకు చేసింది ఏమీ లేదని సుస్పష్టం అవుతోంది.

ప్రభుత్వాలే ప్రజలకు సేవ చేయాలని నిజంగా నడుంబిగించి కష్టపడితే సోనూ సూద్ లాంటి ఓ నటుడి సేవలను దేశ ప్రజలు ప్రశంసించేవారు కాదు. ఒకవేళ ప్రశంసలు పొందాల్సివచ్చినా ఏకంగా యావత్ దేశం ఒక్కటిగా నిలచి ప్రశంసించేలా మాత్రం వుండవు. ఏకంగా బీజేపికి చెందిన ప్రజాప్రతినిధులే అక్కడున్న మా వారికి సాయం చేయండీ అంటూ విన్నవించుకున్నారంటే పరిస్థితి ఇట్టే అర్థమవుతోంది. సోనూసూత్ తాను చేసిన సేవ‌ల‌కు గానూ ఐక్య‌రాజ్య‌స‌మిత అనుబంధ సంస్థ యునైటెడ్ నేష‌న్స్ డెవ‌లాప్‌మెంట్ ప్రోగ్రామ్ సోనుసూద్‌కి ఎస్‌డీజీ స్పెష‌ల్ హ్యుమానిటేరియ‌న్ అవార్డుని అంద‌జేసింది.

లాక్‌ డౌన్ స‌మ‌యంలో ఎంతో మంది వ‌ల‌స కూలీల‌కు, విద్యార్థుల‌కు, నిస్స‌హాయుల‌కు సేవ‌లందించినందుకు గానూ ఆయ‌న‌కు ఈ అవార్డు ద‌క్కింది. వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో సోమ‌వారం సాయంత్రం ఈ అవార్డును ప్ర‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఐరాస అవార్డుని అందుకున్న హాలీవుడ్ న‌టులు ఏంజిలీనా జోలీ, డేవిడ్ బెక్‌హామ్‌, లియోనార్డో డికాప్రియో, బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ల స‌ర‌స‌న సోనుసూద్ నిలిచారు. ఇదొక గౌర‌వం. ఐరాస గుర్తింపును పొంద‌డం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. నాకు వీలైన విధంగా దేశ ప్ర‌జ‌ల‌కు చేయ‌గ‌లిగిన స‌హాయాన్ని చేశాను` అని సోనుసూద్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles