YCP MLA Sridevi Warns to CI Over Vehicle checking 'ఏరా.. నీకేమైనా మెంటలా..' సీఐకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

Ycp mla undavalli sridevi warns to ci over vehicle checking

YSRCP MLA, ycp mla sridevi, Undavalli Sridevi, ycp mla warning to Police Officer, audio of ycp mla warning CI, call record, ycp mla sridevi warning to ci, ycp mla call record leak, audio leak, call record leak, Thatikonda MLA, YSRCP MLA, Undavalli Sridevi, Vehicle Check, Audio call leak, Police Officer, CI, andhra pradesh, politics

Andhra Pradesh Ruling Party YSRCP MLA from Thatikonda, Undavalli Sridevi is in news as allegedly her audio tape goes viral on net. In the audio tape the MLA warns local Police Official ie, Circle Inspector to leave her vehicles which were caught by the police during vehicle check.

ITEMVIDEOS: ‘‘ఏరా.. నీకేమైనా మెంటలా..’’ సీఐకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్

Posted: 09/19/2020 04:20 PM IST
Ycp mla undavalli sridevi warns to ci over vehicle checking

(Image source from: Telugu.news18.com)

అధికారం అంటే సాధారణ విషయం కాదు. అధికారం ఉంటే తిమ్మిని బమ్మిని కూడా చేయవచ్చు. ఎమ్మెల్యేగా గెలుపోందడమే అధికారం వచ్చినట్టు కాదు. తాము గెలిచిన పార్టీ రాష్ట్రంలో పాలన సాగించడమే అధికారమంటే. ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీ అధికారంలో లేకపోతే.. ప్రభుత్వ అధికారులతో పాటు పోలీసు అధికారులతోనూ అయ్యా అప్పా అంటూ పనులు చేయించుకుని ప్రజాప్రతినిదులు.. తమ పార్టీ అధికారంలో వుంటే మాత్రం తాము చెప్పింది చెప్పినట్టుగా చేయాల్సిందేనని అదేశాలు జారీ చేస్తూ అహంకార పూరితంగా వ్యవహరిస్తుంటారు. ఇది కామన్. పార్టీ ఏదైనా.. ప్రజాప్రతినిధులు తీరు మాత్రం ఇంతే అన్నది మనకు తెలిసిందే.

ఇక తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అడపాదడపా అధికార దురహంకారాన్ని ప్రదర్శించినా ప్రభుత్వాలు కూడా చూసిచూడనట్టు వ్యవహరిస్తుంటాయి. గత టీడీపీ హాయంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగుచూశాయి. ఇక తాజాగా వైసీపీ అధికారంలోనూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, ఓ సీఐని దుర్భాషలాడినట్టు చెప్పబడుతున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "నీకేమైనా మెంటలా..." అంటూ "ఏరా" అని సంబోధిస్తూ... పోలీసు అధికారని కూడా చూడకుండా మాట్లాడారు. ఎస్పీగారితో కాన్ఫరెస్సు కాల్ లో వున్నాను అన్న వినిపించుకోకుండా అమె సీఐపై విరుచుకుపడ్డారు.

'ఎప్పటి నుంచి చెబుతున్నాను? వాళ్లను పంపేయొచ్చుగా? వాళ్లను పట్టుకున్న రోజునే నేను నీకు ఫోన్ చేశానా? లేదా? ఏం మాట్లాడుతున్నావ్? నేనంటే గౌరవం లేదా?' అంటూ రెచ్చిపోయారు. 'అందరినీ వదులుతున్నావు, నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ తెచ్చుకున్నావు, రెండు నిమిషాల్లో వెళ్లిపోతావు. ఎస్పీకి, డీజీపీకి చెబుతా' అంటూ హెచ్చరించారు. కాగా, అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నందుకు, వాటిని తరలించిన వాహనాలతో పాటు వాటిని నడిపించిన డ్రైవర్లు, క్లీనర్లను వదిలిపెట్టాలని ఎమ్మెల్యే శ్రీదేవి సిఐపై విరుచుకుపడినట్టు సమాచారం.

(Video Source: ABN Telugu)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles