(Image source from: Millenniumpost.in)
తెలంగాణలో మరోమారు మావోల అలజడి రేగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టు దళాలు ఎదరుపడటంతో ఇరు వర్గాలకు మధ్య ఎదరుకాల్పులు చెలరేగాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పూనుగుప్ప అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకా్లపుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. ఇటీవల గుండాల మండలంలోని దేవెళ్లగూడెం అటవీప్రాంతంలో ఓ మావోయిస్టు మృతి చెందగా.. తాజాగా చర్ల మండలంలోని పూనుగుప్పలో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మావోయిస్టులు మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి, ఇది జరిగిన గంట వ్యవధిలోనే పోలీసులు ఎదరు కాల్పులు జరిగాయి, ఈ నెలలో ఇదే జిల్లాలో మూడు ఘటనలు చోటుచేసుకున్నాయి, గుండాలలో ఎదురుకాల్పుల జరిగి పక్షం రోజులు కూడా గడవక ముందే చర్లలో మరో ఎదురుకాల్పుల ఘటన జరగడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంతకుముందు మల్లెపల్లిటోగు అడవిలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ను గాయపర్చిన మావోయిస్టులు తప్పించుకున్న ఘటన నుంచి ఇక్కడ కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతున్నాయి.
ఆగస్టు 6న బంద్ పేరుతో మావోయిస్టులు దాడులకు కుట్ర పన్నారని కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. భద్రతా బలగాలు, ప్రజాప్రతినిధులపై దాడులకు కుట్ర పన్నినట్లు తమకు సమాచారం అందిందన్నారు. దీంతో చర్ల అటవీ ప్రాంతంలో బలగాలను అప్రమత్తం చేసి మావోయిస్టుల కోసం విస్తృతంగా కూంబింగ్ చేపట్టామని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం పూసుగుప్పలో పోలీసులు-మావోయిస్టుల మధ్య 20 నిమిషాలపాటు ఎదురుకాల్పులు జరిగాయన్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు ఎస్పీ ధ్రువీకరించారు. ఘటనాస్థలంలో ఎస్బీబీఎల్ తుపాకీ, పిస్టల్, రెండు కిట్ బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాల్పులు జరిగిన ప్రదేశంలో తనిఖీలు కొనసాగుతున్నాయని ఎస్పీ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Jan 11 | తెలంగాణ సీఎం కేసీఆర్ సమీప బంధువుల కిడ్నాప్ కేసులో అరెస్టయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో పరాభవం ఎదురైంది. అమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం... Read more
Jan 11 | భారత్ లో బర్డ్ ఫ్లూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజుకో రాష్ట్రాలకు రాష్ట్రాలను వ్యాపిస్తూ అందోళనకర పరిస్థితులకు దారితీస్తోంది. బర్డ్ ఫ్లూ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. మొదట రాజస్థాన్, మధ్యప్రదేశ్లో... Read more
Jan 11 | ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెలలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల కమీషన్ నగరా మ్రోగించిన నేపథ్యంలో దీనిని వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. ఎన్నికలను నిలుపుదల చేయాలని రాష్ట్ర హైకోర్టును... Read more
Jan 11 | వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ వున్న పత్రీ ఒక్కరికీ ఇదో అందివచ్చిన అద్భుత సాధనం.. తమ ఫోటోలతో పాటు పలు వీడియోలు, ఇతర సమాచారాన్ని తమ అప్తులు, స్నేహితులు, బంధువులతో పంచుకునేలా దోహదపడుతోంది. అయితే తాజాగా... Read more
Jan 11 | జమ్మూకాశ్మీర్ లో గత ఏడాది జరిగిన ఎన్ కౌంటర్ పథకం ప్రకారం ఆర్మీ అధికారులు చేసిన ఘటనా..? లేక వారు ఉగ్రవాదులా.? అన్న ప్రశ్నలకు ప్రస్తుతం పోలీసుల చార్జీషీటు సంచలనంగా మారింది, జమ్మూకాశ్మీర్ లోని... Read more