Account of PM Modi's personal website hacked, Twitter confirms అందుకనే.. ప్రధాని పర్సనల్ ట్విట్టర్ అకౌంట్, వెబ్ సైట్ హ్యాక్..

Hacked pm modis twitter account to make a point on paytm mall breach hackers

Hackets, John wick Narendra Modi Twitter, Narendra Modi, Prime Minister, Modi Twitter, Modi Twitter hacked, PayTM Mall, John Wick, hacker, hacker group

A Twitter account linked to Prime Minister Narendra Modi's personal website was purportedly compromised early, with a series of tweets sent out by an individual or a group identifying themselves as 'John Wick' who later told that the hack was meant to clear their name in a separate breach involving a popular e-commerce website.

అందుకనే.. ప్రధాని పర్సనల్ ట్విట్టర్ అకౌంట్, వెబ్ సైట్ హ్యాక్..

Posted: 09/03/2020 05:14 PM IST
Hacked pm modis twitter account to make a point on paytm mall breach hackers

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ఈ తెల్లవారుజామున హ్యాకింగ్ కు గురైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ట్విట్టర్ కూడా అధికారికంగా నిర్ధారించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్టు ట్విట్టర్ ప్రతినిధులు పేర్కొన్నారు. మోదీ ట్విట్టర్ ఖాతా ఈ తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో హ్యాక్ అయినట్టు తెలిపింది. హ్యాక్ అయిన మోదీ ఖాతాకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ప్రధాని వ్యక్తిగత ట్విట్టర్ వెబ్ సైట్, మొబైల్ యాప్ లను తామే హ్యాక్ చేసినట్లు ‘‘జాన్ విక్’’ గా పేర్కోంటున్న ఓ బృందం స్పష్టం చేసింది. అయితే ఇలాంటి చర్యలకు ఎందుకు పాల్పడింది కూడా వారు వివరించారు.

ప్రధానమంత్రి జాతీయ రిలీఫ్ ఫండ్ తో అనుసంధానమైన ఓ క్రిప్టోకరెన్సీ వాలెట్ కు కోవిడ్ నేపథ్యంలో విరాళాలు ఇవ్వాలని కోరిన పలు పోస్టులు కూడా వున్నాయని ట్విట్టర్ అధికార ప్రతినిధి తెలిపారు. కాగాఈ సందర్భంగా హ్యాకర్లు చేసిన ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి. ప్రముఖ ఇ-కామర్స్ వెబ్ సైట్ హ్యకింగ్ లో తమ ప్రమేయముందన్న అభియోగాలు వ్యక్తం కావడంతోనే తాము ఇలాంటి చర్యలకు పాల్పడాల్సి వచ్చిందని పేర్కోన్నారు. అంతేకానీ ప్రధాని వ్యక్తిగత ఖాతాలను హ్యాక్ చేయడానికి వేరే ఉద్దేశ్యం లేదని తెలిపారు. ఇటీవల పేటియం మాల్ హ్యాకింగ్ లో కూడా తమ ప్రమేయం ఉందని కొన్ని తప్పుడు వార్తలు వచ్చాయన్ని అన్నారు.

పేటీయం మాల్ హ్యాకింగ్ లో తమకు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టతను ఇచ్చేందుకే న్యూస్ పబ్లిషర్లకు పత్రికా ప్రకటనలను జారీ చేశామని, అయితే దీనిపై ఏ ఒక్కరు స్పందించలేదని, తాము ప్రచురణర్థాం ఇచ్చిన వార్తను కూడా ప్రచురించనూ లేదని, దీంతో తాము ఏదైనా పెద్దగా చేయాలన్న తలంపుతోనే ప్రధాని వ్యక్తిగత అకౌంట్లను హ్యాక్ చేశామని చెప్పారు. అయితే ప్రధాని వ్యక్తిగత అకౌంట్ కు సంభందించి ఎలా హ్యాకింగ్ చేశామన్న వివరాలను వెల్లడించేందుకు ఇష్టపడని హ్యాకర్లు.. ప్రధాని వ్యక్తిగత అకౌంట్ కు భద్రతలో డొల్లతనం వుందని స్పష్టం చేసింది. ప్రధాని స్థాయి వ్యక్తి అకౌంట్లకు భద్రత అంతంతమాత్రంగానే వుందని అన్నారు.

అయితే హ్యాకింగ్ చేయడాన్ని నిర్థారించిన ట్విట్టర్ అధికార ప్రతినిధిలు.. ఈ హ్యాకింగ్ గురించి తమకు తెలుసునని, ఈ క్రమంలో ప్రధాని పర్సనల్ అకౌంట్ ను  భద్రపర్చేందుక కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జులైలో పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురవడం సంచలనమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. జులైలో హ్యాక్‌కు గురైన ట్విట్టర్ ఖాతాల్లో అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిలియనీర్ ఎలాన్ మస్క్ వంటి వారివి ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hackets  John wick  Narendra Modi  Twitter  PayTM Mall  hacker group  

Other Articles