Pranab Mukherjee cremated with full state honours అశ్రునయనాల మధ్య ప్రణబ్ ముఖర్జీకీ అంత్యక్రియలు..

Former president pranab mukherjee cremated with full state honours

pranab mukherjee death,Breaking news pranab mukherjee death,Pranab Mukherjee news,Pranab Mukherjee, Covid-19 positive,Former President Pranab Mukherjee death, Pranab Mukherjee,pranab mukherjee biography, what happened to pranab mukherjee,present president of india, pranab mukherjee twitter, Pranab Mukherjee, Death, Ramnath Kovind, President, Venkaiah naidu, vice-president, PM Modi, Rahul Gandhi, Delhi

Last rites of former president Pranab Mukherjee held at Lodhi Crematorium on September 01. He had tested positive of COVID-19 and had undergone surgery for a brain clot at Army (R&R) Hospital on August 10, where he passed away on August 31. He served as President of India from 2012 to 2017.

అశ్రునయనాల మధ్య మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకీ అంత్యక్రియలు..

Posted: 09/01/2020 11:01 PM IST
Former president pranab mukherjee cremated with full state honours

భరత మాత ముద్దుబిడ్డ, అపర చాణక్యుడు, రాజనీతి కోవిదుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అంత్యక్రియలు కుటుంబసభ్యులు, అభిమానుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. ఢిల్లీలోని లోథీ శ్మశానవాటికలో ఆయనకు పూర్తిస్థాయి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రణబ్ పార్థివదేహంపై జాతీయ పతాకాన్ని ఉంచిన సైనికులు, గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. కుటుంబ సంప్రదాయం ప్రకారం కుమారుడు అభిజిత్ ముఖర్జీ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ఢిల్లీలోని 10 రాజాజీ మార్గ్ లోని ప్రణబ్ ముఖర్జీ నివాసం నుంచి లోథీ శ్మశాన వాటిక వరకు ఆయన అంతిమ యాత్ర కొనసాగింది.

కాగా ప్రణబ్ ముఖర్జీకి కూడా శస్త్ర చికిత్సకు ముందు చేసిన పరీక్షలలో కరోనా పాజిటివ్ సోకిందని నిర్థారణ కావడంతో పాటు కరోనా మార్గదర్శకాల నేపథ్యంలో సురక్షిత దూరం పాటిస్తూ, నిబంధనలు పాటిస్తూ అంతిమయాత్ర సాగింది. అంతకుముందు నివాసంలో ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజనాథ్‌ సింగ్‌, లోక్ సభ స్పీకర్‌ ఓం బిర్లా, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, బీజేపీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా, కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ సహా త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌, త్రివిధ దళాధిపతులు ఇతర ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pranab Mukherjee  Death  Ramnath Kovind  President  Venkaiah naidu  vice-president  PM Modi  Rahul Gandhi  Delhi  

Other Articles