India's first covid vaccine Covaxin seen no side effects in trials శుభవార్తను అందించిన స్వదేశీ కరోనా వాక్సీన్ 'కోవాగ్జిన్'

Coronavirus vaccine covaxin found safe and side effect free in phase i trials

COVID-19, coronavirus, corona positive, Dr E Venkata Rao, Phase II trial, SUM Hospital, Bharat Biotech, ICMR, NIV, Covaxin, COVID-19 vaccine

Preparations are underway at a hospital here for the commencement of the second phase of human clinical trial of 'Covaxin', India's indigenous COVID-19 vaccine, officials said.'The Phase I of the trial is still continuing as we are planning for the start of the Phase II trial shortly,' Dr E Venkata Rao, Principal Investigator of the trial at Institute of Medical Sciences and SUM Hospital, faculty of medical sciences, said.

శుభవార్తను అందించిన స్వదేశీ కరోనా వాక్సీన్ ‘కోవాగ్జిన్’

Posted: 09/01/2020 05:31 PM IST
Coronavirus vaccine covaxin found safe and side effect free in phase i trials

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు దాని నుంచి రక్షణ పోందేందుకు వాక్సీన్ లను సిద్దం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్ లు సంయుక్తంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ 'కోవాగ్జిన్' హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వాగ్జిన్ దేశప్రజలకు ఓ శుభవార్తను శుభవార్త వెలువరించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపోందించిన ఈ వాగ్జిన్ పూర్తిగా సురక్షితమన్న వివరాలను వెలువరించింది.

తొలి దశ ట్రయల్స్ ముగిశాయని, ఇందులో భాగంగా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఇండియాలో మూడు వ్యాక్సిన్ లకు ట్రయల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే. వాటిల్లో భారత్ బయోటెక్ వ్యాక్సిన్ తో పాటు ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన వ్యాక్సిన్ ముందున్నాయి. ఈ రెండూ ప్రస్తుతం రెండు, మూడవ దశ ట్రయల్స్ లో నిమగ్నమై ఉన్నాయి. ఇక భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ను దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశోధిస్తున్న వైద్య బృందాల నుంచి ఎప్పటికప్పుడు రిపోర్టులు వస్తున్నాయి.

ఈ ట్రయల్స్ నిర్వహించిన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. దీన్ని తీసుకున్న వారిలో కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, వారికి నిర్వహించిన రక్త పరీక్షల్లో ఇదే విషయం వెల్లడైందని వైద్యాధికారులు వెల్లడించారు. ఇకపై 28, 42, 104, 194 రోజులలో కూడా వారి నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ఇక త్వరలో ఫేజ్-2 ట్రయల్స్ ప్రారంభం కానుందని వెల్లడించారు, కాగా, నిన్న మీడియాతో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్, డిసెంబర్ లోగా వ్యాక్సిన్ విడుదలవుతుందని, ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయని ప్రకటించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles