No signs of COVID-19 vaccine access strategy: Rahul Gandhi ప్రభుత్వానికి ముందుచూపు లేదు: రాహుల్ గాంధీ

Centres unpreparedness alarming rahul gandhi targets govt over coronavirus vaccine strategy

Rahul Gandhi, Congress leader Rahul Gandhi, vaccine to fight coronavirus, coronavirus alarming, corona vaccine, government unpreparedness, no signs of covid vaccine, national, politics

Congress leader Rahul Gandhi slammed the Centre for failing to have a vaccine to fight the novel coronavirus, and said the government’s unpreparedness is alarming. Youth Leader wrote on Twitter, 'A fair and inclusive Covid vaccine access strategy should have been in place by now. But there are still no signs of it.'

33 లక్షల మంది బాధితులైనా.. ప్రభుత్వానికి ముందుచూపు లేదు: రాహుల్ గాంధీ

Posted: 08/27/2020 03:09 PM IST
Centres unpreparedness alarming rahul gandhi targets govt over coronavirus vaccine strategy

(Image source from: Ndtv.com)

దేశం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడం వల్ల సమస్యలు పరిష్కారం కావని.. దీంతో సమస్యలు మరింత జఠిలం అవుతాయని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు, అందుకోసం దేశంలోని మీడియాను ఉపయోగించుకోవడం వల్ల పేదలకు ఒరిగేది ఏమీ లేదని ఆయన అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. దేశంలో కొవిడ్‌-19 మహమ్మారి 33 లక్షల మందికి పైగా వ్యాప్తించినా.. ప్రభుత్వం ఇప్పటికీ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురాలేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే సమగ్ర వ్యాక్సిన్‌ విధానాన్ని రూపొందించి, అనుసరించాల్సి ఉండగా... ఆ దిశగా చర్యలు కనుచూపు మేరలో కనపడటం లేదని విమర్శించారు.

‘‘కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ పాటికే సక్రమమైన, అందరినీ కలుపుకునే విధంగా వ్యూహాన్ని అనుసరించి ఉండాలి. కానీ, ఇప్పటికీ ఆ సూచనలు లేవు. భారత ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం ఆందోళనకరం’’ అని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ధ్వజమెత్తారు. భారత్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ఉత్తత్తి చేసే సామర్థ్యమున్న దేశమని రాహుల్‌ గతంలో ప్రకటించారు. కరోనా మహమ్మారి ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై భారీగానే ఉంటుందని ఆర్బీఐ తాజాగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాహుల్ మాట్లాడుతూ, గత కొన్ని నెలలుగా ఇదే విషయంపై తాను హెచ్చరిస్తున్నానని.. తన వ్యాఖ్యలను ఇప్పుడు ఆర్బీఐ నిర్ధారించిందని చెప్పారు.

కాగా, వ్యాక్సిన్‌ను అందుబాటు తెచ్చేందుకు, సక్రమంగా పంపిణీ చేసేందుకు.. స్పష్టమైన, సమదృష్టిగల వ్యూహాన్ని రూపొందించి, అనుసరించాలన్నారు. మీడియాలో ప్రకటనలు పేదలకు మేలు చేయవని ఆయన విమర్శించారు. ఆర్థికి పరిస్థితిని మెరుగుపరచాలంటే... ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఎక్కువ అప్పులు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. పేదలకు డబ్బు ఇవ్వాలని, పారిశ్రామికవేత్తలకు ఎక్కువ పన్నులు విధించరాదని సూచించారు. వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని చెప్పారు. మీడియాలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోవని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles