Raigad building collapse: rescue operations underway రాయ్ గఢ్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఐదుగురిపై కేసు

Raigad building collapse case fir lodged against five accused

Raigad building collapse, Maharashtra building collapse, FIR, Five Accused, five-storey residential building, Mahad building collapse, Mahad city, Raigad district collector, Kahad Police Station, Maharashtra police, Raigad, Maharashtra, crime

A day after a five-storeyed building in Maharashtra's Raigad district collapsed, the police has registered a case against five persons in connection with the tragic incident. The FIR against the five accused has been registered at the Kahad Police Station under section 304 of the Indian Penal Code.

రాయ్ గఢ్ లో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. ఐదుగురిపై కేసు

Posted: 08/25/2020 01:12 PM IST
Raigad building collapse case fir lodged against five accused

మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో పోలీసులు ఐదుగురు వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన దారి తీయడానికి కారణమయ్యారని వారిపై కహడ్ పోలిస్ స్టేషన్ లో భారత శిక్షాస్మృతి సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ఒక వ్యక్తి మరణించగా, 60 మంది గాయాలపాలయ్యారు. కాగా మరో 30 మంది వరకు భవన శిధిలాల కింద చిక్కుకుపోయి వుంటారని స్థానికులు, పోలీసులు వెల్లడిస్తున్నారు. ఇందుకు కారణమైన ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తప్పించుకున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేషశారు. వారిని ఎట్టిపరిస్థితుల్లో అరెస్టు చేస్తామని జిల్లా ఎస్పీ అనిల్ పరక్సార్ అన్నారు.

ఇక ఈ దుర్ఘటనలో చనిపోయిన వ్యక్తి గుండెపోటులో మరణించారని ఆయన తెలిపారు. కుప్పుకూలుతున్న భవనం రాయి తనకు బలంగా తగలడంతో అదిరిపడిన వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడని ఎస్పీ తెలిపారు. కాగా, ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే మహారాష్ట్ర మంత్రులు అతిధి థాట్కరే, ఏక్ నాథ్ షిండేలు ఘటనస్థలికి వచ్చి సహాయక చర్యలను పర్యవేక్షించారు, ఈ ఘటనపై ఇవాళ ఉదయం ప్రధాని మంత్రి కూడా భాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనను తనను బాధించిందని అన్నారు. రాష్ట్ర అధికార యంత్రంగాంతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలను చేపడుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అకాంక్షించారు.

దేశ ఆర్థిక రాజధాని ముంబైకి 170 కిలోమీటర్ల దూరంలోని మహద్ తహశీల్ పరిధిలోని కాజల్ పురా నగరానికి చెందిన ఈ భవనం ఆరేళ్ల క్రితమే నిర్మితమైందని, ఇందులో ఏకంగా నలబై ప్లాట్లు వున్నాయని స్థానిక అధికార యంత్రాంగం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఐదారేళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం కుప్పకూలడానికి కారణాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు, నిన్న రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇప్పటి వరకు 60 మందిని రక్షించగా, ఇంకా 30 మంది వరకు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

గాయపడిన వారిని ముంబై ఆసుపత్రికి తరలించారు. స్థానిక అధికారులతో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే మాట్లాడారు. క్షతగాత్రులను రక్షించేందుకు యుద్ద ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని అదేశాలను జారీ చేశారు. కాగా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ భవనంలోని అనేక కుటుంబాలు తమ స్వస్థలాలకు వెళ్లిపోయాయని స్థానికులు తెలిపారు, ప్రమాదం సంభవిస్తున్న సమయంలోనే అప్రమత్తంగా వ్యవహరించిన సుమారు 70 మంది తప్పించుకున్నారని, కాగా శిధిలాల కింద చిక్కుకున్న 60 మందిని సహాయక బృందాలు రక్షించామని, మరో 30 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, కూలిన భవనంలో 45 వరకు కుటుంబాలు నివసిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రమాద సమయంలో ఎంతమంది ఉన్నారనేది కచ్చితంగా తెలియరాలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles