బాలీవుడ్ లో మరో విషాదం అలుముకుంది. ప్రముఖ దర్శకుడు, నటుడు నిషికాంత్ కామత్ (50) కన్నుమూశారు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ మధ్యాహ్నం తిరిగిరాని లోకాలకు తరలివెళ్లారు, తీవ్ర జ్వరం, ఆయాసంతో బాధపడుతూ గత నెల 31న ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకున్నట్లు కనిపించినా ఇవాళ మధ్యాహ్నం ఆకస్మాత్తుగా ఆయన అరోగ్యం విషమించింది. దీంతో ఆయన తుది శ్వాస విడిచారని ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వివిధ అవయవాలు పనిచేయకపోవడం వల్ల ఆయన కన్నుమూసినట్లు వైద్య నిపుణులు తెలిపారు.
ఆయన గత రెండేళ్లుగా కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి ఆయన తన అనారోగ్యం సమస్యకు చికిత్సను పోందుతూనే వున్నారు. అయితే ఒక్కసారిగా ఆయన అనారోగ్యం పూర్తిగా తిరగబడటంతో ఆయన జులై 31న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పోందుతూ కొద్దిగా కొలుకున్నారని, త్వరలోనూ పూర్తిగా రికవర్ అయ్యి వస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన అరోగ్యం ఇవాళ మధ్యాహ్నం అకస్మాత్తుగా విషమించింది. వైద్యులు ఆయనకు చికిత్స చేసినా.. ఆయన శరీరంలోని పలు ఆవయవాలు సహకరించకపోవడంతో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. నిషికాంత్ దర్శకత్వం వహించిన ‘దృశ్యం’, ‘మదారి’, ‘ముంబయి మేరీ జాన్’ తదితర చిత్రాలు జనాధరణ పోందాయి, నిషికాంత్ కామత్ పలు మరాఠీ చిత్రాల్లో నటించారు. 2005లో ఆయన తొలిసారి దర్శకత్వం వహించిన ‘డాంబివాలీ’ మరాఠీ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
నిషికాంత్ మరణ వార్తలను తొలుత ఆయన స్నేహితుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ఖండించారు. నిషికాంత్ చనిపోలేదని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారని పేర్కొన్నారు. ఆ తరువాత కొద్దిసేపటికే నిషికాంత్ కన్నుమూయడంతో రితేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా ప్రియమైన స్నేహితుడిని కోల్పోతున్నా. నిషికాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి’ అని ట్వీట్ చేశారు. నిషికాంత్ మృతిపై బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా విచారం వ్యక్తం చేశారు. ‘‘కేవలం ‘దృశ్యం’ చిత్రంతోనే మా ఇద్దరి స్నేహాన్ని సరిచూడలేను. ఆయన నన్ను, టబును కలిపి అద్భుతంగా ఆ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన తెలివైన వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతుంటారు. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. నిషికాంత్ ఆత్మకు శాంతి చేకూరాలి’’ అని అజయ్ ట్వీట్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more
Oct 07 | గుజరాత్ పోలీసులు స్థానిక యువతపై కాకీ కాఠిన్యాన్ని ప్రదర్శించారు. ఓ వర్గానికి చెందిన యువతపై ఇలా విరుచుకుపడటం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అంటూ కేంద్ర,... Read more