Telangana's tally surges past 60000 mark with 1811 cases తెలంగాణలో 24 గంటల్లో 1811 కేసులు.. 13 మరణాలు

Covid 19 update with 1811 new covid 19 cases telanganas tally surges past 60000 mark

coronavirus, coronavirus in Telangana, Telangana coronavirus cases, coronavirus cases in Telangana, coronavirus count in india, india coronavirus count, Tabilghi Jamat Telangana, Tabilghi jamat Telangana cases, Nizamudding event Telangana, Delhi coronavirus cases, Delhi Nizamuddin coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, coronavirus in ts, coronavirus Hyderabad, Telangana

There is no stopping to the rise in the number of positive COVID-19 cases in Telangana. The state government has come under intense pressure from all corners for the lack of testing and mismanagement of the crisis in the state. 1811 fresh COVID-19 cases were reported in Telangana which saw the state's tall cross the 60000-mark.

తెలంగాణలో కరోనా విజృంభన: 60 వేలు దాటిన కేసులు, 500 దాటిన మరణాలు

Posted: 07/30/2020 12:34 PM IST
Covid 19 update with 1811 new covid 19 cases telanganas tally surges past 60000 mark

(Image source from: Mictv.in)

తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ బుసకొడుతోంది. రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకూ రాష్ట్రంలో పెరుగుతున్న కేసులు తాజాగా అరవై వేల మార్కును దాటాయి. వీటికి తోడు మరణాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. తెలంగాణ వాసులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా నమోదైన మరణాలతో తెలంగాణ.. ఏకంగా మరణాలలో 500 మార్కును అధిగమించడం కూడా అందోళన రేకెత్తిస్తోంది. ఇదివరకే దేశంలో వందకుపైగా మరణాలు నమోదు చేసుకున్న ఏడవ రాష్ట్రంగా నమోదైన తెలంగాణ.. ఇక ఇటు కరోనా కేసులలోనూ పైకి ఎగబాకుతోంది. ప్రభుత్వం, అరోగ్యశాఖ అధికారులు, వైద్యులు, హెల్త్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బంది, పోలీసుల సమిష్టి కృషితో రాష్ట్రంలో తగ్గినా.. మళ్లీ పెరుగుతున్న కేసులు, మరణాలు వారి పనితీరుకు సవాల్ విసిరేలా తయరావుతున్నాయి.

తెలంగాణలో మే నెల 7 నుంచి క్రమంగా పెరుగుతూ వస్తోన్నాయి. కాగా జూన్ నెలలో కేంద్రం దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కు పలు సడలింపులు తీసుకురావడంతో జనజీవనం వేగాన్ని అందుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని నగరంలో కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సి వున్నా.. అటు ప్రభుత్వం కానీ, ఇటు ప్రజలు కానీ జాగ్రత్త చర్యలు పాటించకపోవడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా విజృంభన కోనసాగుతోంది. హైదరాబాద్ నగరం చుట్టూరా కరోనా మహమ్మారి మాటు వేయడం అందోళన రేపుతోంది. అయితే గ్రేటర్ లో కరోనా నియంత్రణకు కఠినమై చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా వ్యాప్తి మాత్రం అగడం లేదు. అయితే గత నెల రోజులకు భిన్నంగా ఇవాళ కరోనా కేసులు కాసింత తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. తాజాగా ఏకంగా పద్దెనిమిది వందలకు చేరువలో కరోనా కేసులు నమోదుకాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 500 నమోదు కావడంలో నగరవాసుల్లోనూ ఆందోళనకు దారి తీస్తోంది.

గత పక్షం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోనూ పెరుగుతూ వచ్చిన  కరోనా పాజిటివ్ కేసులు ఇవాళ కాసింత తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా తెలంగాణలో అంతకంతకూ పెరుగుతున్న కేసులు తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కేసులతో కలిపి మొత్తంగా అరమై వేల మార్కును అధిగమించాయి, దీంతో ఈ స్థాయిలో కరోనా కేసుల నమోదు చేసుకున్న 7వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తాజాగా రాష్ట్రంలో 1811 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ లో ఇదివరకు ఎన్నడూ నమోదు కాని అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 521 కోరానా పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి, ఇవాళ గ్రేటర్ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, వరంగల్ అర్భన్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లోనూ కరోనా కేసులు అధికసంఖ్యలో నమోదయ్యాయి.

అయితే గత వారం రోజులుగా నమోదవుతున్న కేసుల తెలంగాణవాసులను కలవరానికి గురిచేస్తోంది. హైదరాబాద్ లో పంజా విసురుతున్న కరోనా.. ఇక జిల్లాల్లోనూ తన ఉద్దృతిని చాటుకుంటోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కేసులు మొత్తంగా 60000 మార్కును దాటిన విషయం తెలిసిందే, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులెవరికీ కరోనా పాజిటివ్ నిర్థారణ కాలేదని, అన్ని రాష్ట్రానికి చెందిన వారివేనని రాష్ట్ర వైద్య అరోగ్యశాఖ వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల వ్యవధిలో మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది. రాష్ట్రంలో గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి అసుపత్రులలో చికిత్సపోందుతూ పన్నెండు మంది అసువులు బాసారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 505కు చేరింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం దాల్చింది. కరోనా ఉద్దృతి ధాటికి తెలంగాణలో వ్యాపారాలు, నివాసాలు ఏర్పర్చుకున్న వలస కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ లగేజీ సర్దేసుకుంటున్నారు.

తాజాగా నమోదైన ఇవాళ నమోదైన 1811 కేసులతో మొత్తంగా రాష్ట్రంలో 60,717 కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే అదిలాబాద్ 18, భద్రాద్రి కోత్తగూడెం జిల్లాలో 27, జీహెచ్ఎంసీ పరిధిలో 521, జగిత్ాయలలో 15, జనగాంలో 22, జయశంకర్ భూపాలపల్లిలో 20, జోగులాంబ గద్వాల జిల్లాలో 28, కామారెడ్డిలో 11, కరీంనగర్లో 97, ఖమ్మంలో 26, కుమరం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో 6, మహబూబ్ నగర్ జిల్లాలో 41, మహబూబాబాద్ జిల్లాలో 39, మంచిర్యాలలో 18, మెదక్ లో 15, మేడ్చల్ మల్కాజ్ గిరిలో 151, ములుగులో 16, నాగర్ కర్నూల్ లో 9, నల్గోండలో 61 కేసులు నమోదయ్యాయి,

ఇక ఆతరువాత నారాయణ పేట్ లో 9, నిర్మల్ లో 12, నిజామాబాద్ లో 44, పెద్దపల్లిలో 21, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 289, సంగారెడ్డి 33, సిద్దపేట జిల్లాలో 24, సూర్యాపేట లో 37, వికారాబాద్ లో 12, వనపర్తిలో  23, వరంగల్ రూరల్ లో 18, వరంగల్ అర్భన్ లో 102, యాదాద్రి భువనగిరి జిల్లాలో 16 కేసులు నమోదయ్యాయి, కరోనా బారినపడిన బాధితులు కోలుకొన్న పలువురు రోగులను అధికారులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో మొత్తంగా 44,572 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,640 యాక్టివ్‌ కేసులు వున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh