Few more software companies to follow Tech giant path ఆ కంపెనీ బాటలో మరిన్నీ.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Good news for google employees tech giant allows work from home till june 2021

coronavirus, coronavirus in America, coronavirus cases, coronavirus india, coronavirus update, coronavirus in india, coronavirus cases, coronavirus cases india, coronavirus update india, coronavirus news, COVID-19, COVID 19 update, google work from home, google work from home update, Google, Technology

In a major announcement, search engine giant Google has informed its employees that they can continue to work from home till the end of June next year. The decision has been taken in the wake of COVID-19 outbreak and will benefit over 2 lakh Google and Alphabet employees around the world, including India

ఆ కంపెనీ బాటలో మరిన్నీ.. సాప్ట్ వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

Posted: 07/28/2020 03:48 PM IST
Good news for google employees tech giant allows work from home till june 2021

సాప్ట్ వేర్ దిగ్గజ సంస్థ బాటలో మరికొన్ని సంస్థలు పయనిస్తూ.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ను అందిస్తున్నాయి. అ దిగ్గజ సంస్థ ఏంటీ.. అందించే శుభవార్త ఏంటీ అంటారా.? టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ తమ ఉద్యోగులకు తాజాగా చక్కని శుభవార్తను అందించింది. ఈ ఏడాది చివరి నాటికి కరోనా మహమ్మారికి వాక్సీన్ వస్తున్నట్లు ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలు ప్రకటించినా... ఉద్యోగులు ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకున్న సంస్థ వచ్చే ఏడాది జూన్ వరకు అంటే సుమారుగా మరో ఏడాది కాలం పాటు (2021 జూన్ 30 వరకు) తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిచేసుకునే వెసలుబాటును కల్పిస్తూ తాజాగా మరోమారు అనుమతినిచ్చింది టెక్ దిగ్గజ సంస్థ గూగుల్, ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలలో కట్టడి అయినా అనేక దేశాల్లో ఇంకా విజృంభిస్తూ అనేక మందిపై కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం చూపుతున్న నేపథ్యంలో గూగుల్ సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది.

గూగల్ సంస్థ తీసుకున్న తాజా నిర్ణయాన్ని తమ ఉద్యోగులకు తెలిపారు ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు తన ఇమెయిల్ ద్వారా విషయాన్ని తెలిపారు. "ఉద్యోగులు భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి వీలుగా, 2021 జూన్ 30 వరకు స్వచ్ఛందంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. వాళ్లు తమ విధులు నిర్వహించడానికి ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదు" అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మెయిల్ పంపారు. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాలు వున్న గూగుల్ తాజా నిర్ణయంతో ప్రుపంచ వ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల మందికి ఈ వెసలుబాటు అందుకోనున్నారు, ఇటు మన దేశంలోనూ గూగుల్ సంస్థ కార్యాలయం ఉండటంతో మనవారు కూడా ఈ వర్క్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని అందుకోనున్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఈ ఏడాది మార్చి మాసంలో తమ ఉద్యోగులకు 2021 జనవరి వరకు తొలుత ఇంటి నుంచి పనిచేసుకునేలా సదుపాయాన్ని కల్పించిన ఈ సంస్థ.. తాజాగా కరోనా మహమ్మారి ఉద్దృతి నేపథ్యంలో.. తమ ఉద్యోగుల ఆరోగ్యాలకు కూడా పెద్ద పీట వేస్తూ.. గూగుల్  సంస్థ తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మరో ఐదు మాసాల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని పొడగించింది. ఇక టెక్ దిగ్గజం గూగుల్ తాజా నిర్ణయం తీసుకున్న తరుణంలో అదే బాటలో పయనించేందుకు పలు సాఫ్ట్ వేర్ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు కొన్ని నెలల్లో తమ ఆఫీసుల్ని రీఓపెన్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణంకాల ప్రకారం అమెరికాలో ఇప్పటి వరకు 41 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇక భారతదేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 16 లక్షల మార్కుకు చ రువలో నువన్నాయి. ఇక మరణాలు కూడా 35 వేలు దాటాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  google work from home  google work from home update  Google  Technology  

Other Articles