SC allows to withdraw plea against HC order సచిన్ పైలట్ పై పిటీషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్..

Supreme court allows speaker to withdraw plea against high court order

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

The Supreme Court on Monday found 'no problem' in allowing Rajasthan Assembly Speaker C.P. Joshi to withdraw his petition challenging the State High Court’s 'interference' in the disqualification proceedings against former Deputy Chief Minister Sachin Pilot and 18 other breakaway Congress legislators.

రాజస్థాన్ సంక్షోభం: సచిన్ పైలట్ పై పిటీషన్ ఉపసంహరించుకున్న కాంగ్రెస్..

Posted: 07/27/2020 03:36 PM IST
Supreme court allows speaker to withdraw plea against high court order

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితిని చల్లార్చేందుకు పార్టీలోని సీనియర్ నేతలు ట్రబుల్ షూటర్లుగా రంగంలోకి దిగారు. దీంతో అసమ్మతి జెండా ఎగురవేసిన మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకుంది. దాదాపుగా అందరూ ఊహించినట్టుగానే రాజస్థాన్ లో కాంగ్రెస్ అధిష్టానం అదేశాల మేరకు రాష్ట్ర శాఖ పావులు కదుపుతోంది.  ఈ సమస్య చాలా చిన్నదని, పార్టీలో చర్చించుకుని పరిష్కరించుకుంటే సరిపోతుందని సీనియర్ నేతలు ఒత్తిడి తేవడంతో, వారి అభిప్రాయాలను గౌరవించాలని నిర్ణయించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

దీంతో, ఈ ఉదయం సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే, తమ పిటిషన్ ను విరమించుకుంటున్నట్టు కాంగ్రెస్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ కోర్టులో విచారణలో ఉన్న సమయంలో, విషయం తేలేంతవరకూ అసెంబ్లీని సమావేశ పరచరాదని గవర్నర్ కల్ రాజ్ మిశ్రా నిర్ణయించిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పిటిషన్ ను వెనక్కు తీసుకుని తద్వారా గవర్నర్ ను ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహాన్ని కూడా కాంగ్రెస్ పన్నిందన్న వార్తలు వినిపిస్తున్నాయి, ఇక ఇప్పటికే సుప్రీంకోర్టు రెబల్ నాయకుడు సచిన్ పైలట్ కు అనుకూలంగా.. పార్టీనిర్ణయాలను వ్యతిరేకించినంత మాత్రాన వేటు వేస్తారా.. అంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన అదేశాలపై స్టే ఇచ్చేందుకు వ్యతిరేకించింది.

కాగా, అసెంబ్లీలో ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్ దే తుది నిర్ణయమయి, స్పీకర్ నిర్ణయాలు న్యాయబద్దంగా లేవని భావించిన పక్షంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలని స్పీకర్ సీపీ జోషి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం రాజస్థాన్ స్పీకర్ సీపీ జోషి తరఫున సుప్రీంకోర్టుకు హాజరైన కపిల్ సిబాల్, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు పాటించకపోవడం దురదృష్టకరమని అన్నారు. ఇది తమకు బాధను కలిగిస్తోందని, తమ క్లయింట్ తన పిటిషన్ ను ఉపసంహరించుకుంటున్నారని,  తాము సమస్యను కొనసాగించాలని భావించడం లేదని తన వాదన వినిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles