Rajasthan Governor Acting On Behest Of Centre: Kapil Sibal సచిన్ పైలట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం..

You cant make the party a public tamasha kapil sibal to sachin pilot

AICC, Rajasthan Government, Vishvendra Singh, Bhanwar Lal Sharma, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

You can't be Chief Minister of a state with the support of just 20-25 legislators, Congress leader Kapil Sibal told party rebel Sachin Pilot, hours after the sacked Rajasthan Deputy Chief Minister scored a temporary reprieve at the high court. 'You can't make party a tamasha (grand show) before the public,' Mr Sibal said.

రాజస్థాన్ సంక్షోభం: సచిన్ పైలట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత ఆగ్రహం..

Posted: 07/25/2020 12:32 PM IST
You cant make the party a public tamasha kapil sibal to sachin pilot

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడిన రసకందాయ పరిస్థితుల్లో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే వుంది, అసమ్మతి జెండా ఎగురవేసిన మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వర్గానికి అటు సుప్రీంకోర్టులో ఊరట లభించగా, ఇటు రాజస్థాన్ కోర్టు కూడా ఆయన ఎమ్మెల్యేల వేటుపై స్టేటస్ కో విధించినంది. దీంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి వర్గీయులు అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ వద్ద నిరసన దీక్షకు దిగిన విషయం తెలిసిందే. గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ కూడా చేశారు. అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో..? ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయో కూడా తెలియని ఉత్కంఠ నెలకోంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు యువనేత సచిన్ పైలట్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీ కోసం కష్టపడ్డామని చెప్పుకునే నేత.. తిరుగుబాటు బావుటా ఎందుకు ఎగురవేశారని, నిజంగా పార్టీలో ఆయన సమస్యలను ఎదుర్కోని వుండివుంటే అది పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అధిష్టానం దృష్టికి తీసుకురావాలని కానీ ఇలా కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకుని వెళ్లి బీజేపి పాలిత రాష్ట్రాల్లో తలదాచుకోవడం దేనికి సంకేతమని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీలో చేరనంటూనే హర్యానాలో ఎందుకు ఉంటున్నారని నిలదీశారు. ఇక పనిలో పనిగా కొత్త పార్టీ పెడుతున్నారన్న వార్తలపై కూడా సిబల్ పైలట్ ను ప్రశ్నించారు.

కొత్త పార్టీ ఏమైనా పెట్టే ఉద్దేశం ఉంటే అదేదో చెప్పాలని అడిగిన సిబల్.. సచిన్ పైలట్ తాను ఎదుర్కోంటున్న ఇబ్బందులను అధిష్టానంతో చెప్పుకోలేని నాయకుడు.. తనను నమ్ముకున్నవారికి ఎక్కడకు తీసుకువెళ్తున్నాన్నని కూడా స్పష్టంగా చెప్పలేని ఆగమ్యచోర పరిస్థితల్లోకి జారుకుంటున్నాడని అన్నాడు. తన భవిష్యత్తును అంధకారంగా మార్చుకోవడం ఆయన వ్యక్తిగతం కానీ ఏకంగా 20 మంది ఎమ్మెల్యేల భవితవ్యాన్ని ఎందుకు ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని ప్రశ్నించారు. 20-25 మంది ఎమ్మెల్యేలతో సీఎం అయిపోవాలనే కోరికను కట్టిపెట్టి తమాషాలు ఆపాలని హెచ్చరించారు. సీఎం కావాలనుకుంటే చెప్పాలని, ఎందుకీ నిరసన అని పైలట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీలో చేరడం లేదని ప్రకటించి చెబుతున్న పైలట్.. మరి కాంగ్రెస్ కార్యక్రమాలకు ఎందుకు హాజరు కావడం లేదని, ఒకవేళ కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉంటే ఆ విషయాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. హోటళ్లలో కూర్చుని మాట్లాడడం కాకుండా బయటకు వచ్చి మాట్లాడాలని సిబల్ సవాలు విసిరారు. మరోవైపు రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాపైనా సిబల్ మండిపడ్డారు. గవర్నర్ తన రాజ్యాంగ విధులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్లు రాజ్యాంగానికి, చట్టానికి నిబద్ధులుగా ఉండడం మానేసి కేంద్రం చెప్పినట్టు నడుచుకుంటూ ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యం చెబుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles