Kidnap bid foiled as woman leaps to daughter's defence కిడ్నాపర్ల నుంచి క్షణాలో బిడ్డను కాపాడుకున్న తల్లి..

Mother bravely fights against minor daughter s attempted kidnapping

delhi kidnap, delhi kidnap plot foiled, delhi mother saves child from kidnapping, delhi mother video, shakarpur delhi kidnapping video, shakarpur kidnapping video, delhi news

A woman rescued her four-year-old daughter from two bike-borne men who tried to kidnap her from her house in East Delhi's Shakarpur Tuesday. Neighbours too rushed to the woman's aid, attacking the kidnappers and trying to block their way, but the accused threatened them with a weapon and managed to escape.

ITEMVIDEOS: కిడ్నాపర్ల నుంచి క్షణాలో బిడ్డను కాపాడుకున్న తల్లి..

Posted: 07/23/2020 10:49 PM IST
Mother bravely fights against minor daughter s attempted kidnapping

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎంతో మంది తమ ఉదారతను, ఔదర్యాన్ని, దాతృత్వాన్ని పంచుకుని పలువురికి ఎంతో కొంత తమ శక్తి మేరకు పంచిపెడుతున్న నేపథ్యంలో ఓ సోదరుడు మాత్రం ఆస్తితో వాటా కోసమో లేక అతడి ఎదుగుదలను సహించలేకనో మొత్తానికి తన సొంత అన్నయ్య కూతుర్ని కిడ్నాప్ చేయించడానికి యత్నించి పట్టుబడ్డాడు. అయితే తన నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాపర్లతో పోరాడి అడ్డుకున్నది మాత్రం చిన్నారి తల్లి. ఆమె చేసిన సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన మంగళవారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.

తూర్పు ఢిల్లీకి చెందిన చిన్నారి తండ్రి వస్త్రాల వ్యాపారం చేస్తూ కాస్తోకూస్తో సంపాదించుకున్నాడు. దీంతో అతడిపై ద్వేషం పెంచుకున్న సోదరుడు.. అతడి నుంచి డబ్బులు గుంజేందుకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా అతడి నాలుగేళ్ల కుమార్తెను కిడ్నాప్ చేయాలని భావించి ఇద్దరు కిడ్నాపర్లను రంగంలోకి దింపాడు. ప్లాన్ లో భాగంగా బైక్‌పై వస్త్రవ్యాపారి ఇంటికొచ్చిన కిడ్నాపర్లు నీళ్లు కావాలని అతడి భార్యను అడిగారు. ఆమె నీళ్లు తెచ్చేందుకు వెనక్కి తిరగ్గానే చిన్నారిని ఎత్తుకుని బయటకు వచ్చి పారిపోయేందుకు సిద్ధమవుతుండగా, చిన్నారి అరుపులతో అప్రమత్తమైన ఆమె ఒక్కుదుటన బయటకు వచ్చి వారి చేతుల్లోంచి బిడ్డను లాక్కొంది.

ఈ క్రమంలో కిడ్నాపర్లతో పెనుగులాట జరిగింది. ప్లాన్ ఫలించకపోవడంతో పరారయ్యేందుకు సిద్ధమైన కిడ్నాపర్లను చూసిన ఇరుగుపొరుగు వారు రోడ్డుకు అడ్డంగా బైకులు పెట్టి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు తప్పించుకున్నారు. బాధిత తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ సూత్రధారి అయిన చిన్నారి తండ్రి సోదరుడిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్లు మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నారు. కాగా, రూ. 35 లక్షల కోసమే తాను ఈ కిడ్నాప్‌కు ప్లాన్ వేసినట్టు నిందితుడు పోలీసులకు తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles