Schools in AP to reopen on September 5 ఉపాధ్యయ దినోత్సవం రోజునే బడి గంట మ్రోగేను..!

Andhra pradesh govt plans to reopen schools from september 5

school reopening, andhra school reopening, andhra pradesh school reopening, schools reopening date, lkg ukg in govt schools, schools in andhra pradesh, Y.S. Jagan Mohan Reddy, Jagananna Gorumudda, andhra school students, YS Jagan, Adimulapu Suresh, Education Minister, Andhra pradesh

The Andhra Pradesh government has decided to restart schools from September 5, however, the final decision will be taken based on the situation when the date approaches.

ఉపాధ్యయ దినోత్సవం రోజునే బడి గంట మ్రోగేను..!

Posted: 07/22/2020 10:11 PM IST
Andhra pradesh govt plans to reopen schools from september 5

కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నాటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా నాలుగు నెలల పాటు సెలవులు ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురును చెప్పింది.  విద్యార్థుల పాలిట ఇది చేదు వార్తే అయినా వారి తల్లిదండ్రుల పాలిట మాత్రం ఇది చల్లని కబురే. అయితే ఈ కబరు నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులలో ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఆ కబురు ఏంటీ అంటే.. కరోనా నిబంధనలను అనుసరించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయ దినోత్సవం నాటి నుంచి రాష్ట్రంలో బడి గంట మ్రోగనుంది.

అంటే సెప్టెంబర్‌ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్తు నేపథ్యంలో వారి అమూల్యమైన విద్యా సంవత్సరం వృదా కాకుండా సెప్టెంబర్ 5 నుంచి రాష్ట్రంలో పాఠశాలలను పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మెరుగైన విద్య, విద్యార్థులకు రుచికరమైన జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజన పథకం)పై మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం అనంతరం మంత్రి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. (పాఠశాల విద్యకు కొత్త రూపు)

ఇంగ్లిష్‌ మీడియం, జగనన్న గోరుముద్దలను పకడ్బందీగా అమలు చేయడానికి రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్‌ స్థాయి పోస్టులు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో జిల్లాకు ఒక జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టు ఏర్పాటు చేయనున్నామన్నారు. అంగన్‌ వాడీ కేంద్రాలను ప్రభుత్వ పాఠశాలలతో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్‌ విధివిధానాల రూపకల్పనకు కమిటీ ఏర్పాటు చేయాలని కూడా ముఖ్యమంత్రి జగన్ చెప్పారని సురేష్ తెలిపారు.

కడపలో వైఎస్సార్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజేత స్కూల్‌ మాదిరిగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దివ్యాంగ విద్యార్థులకు విద్యా బోధన సాగించేందుకు రిసోర్స్‌ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సమీక్షా సమావేశంలో మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు. స్కూల్స్‌ ప్రారంభించే వరకు జగనన్న గోరుముద్ద పథకం కింద విద్యార్థులకు మూడో విడత డ్రైరేషన్‌ పంపిణీ కొనసాగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆన్‌ లైన్లో స్కూళ్లకు అనుమతులు, గుర్తింపు పత్రాలు జారీ చేయనున్నామని చెప్పారు. ఇకపై ప్రతి ఏటా అకడమిక్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తామని కూడా విద్యాశాఖ మంత్రి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles