Congress suspends Sanjay Jha for backing Pilot యుద్దం ఇప్పుడే ప్రారంభమైందని సంజయ్ ఝా వార్నింగ్

Rajasthan crisis my loyalty to congress ideology not individual sanjay jha

Sanjay Jha, warnings, sanjay jha sacket, Sanjay Jha responds, sanjay jha warnings, Sachin Pilot sacked, Sachin Pilot BJP, Ashok Gehlot status, rebellion in Rajasthan, Rajasthan Congress crisis, Rajasthan floor test, Rajasthan Assembly, Gulab Chand Kataria, Rajasthan political crisis, Sachin Pilot loyalist MLAs, Sachin Pilot loyalist MLAs Manesar, Manesar, Haryana, Jaipur, Rajasthan, Congress, Politics

Sanjay Jha, who has been suspended by the Congress for anti-party activities, on Wednesday said he is loyal to the party's ideology, but his 'fidelity is not to any individual or family. The entrepreneur-turned-politician also said he will continue to raise issues that are fundamental to the resurgence of his party, and added that the battle has just begun.

‘‘యుద్దం ఇప్పుడే ప్రారంభమైంది’’ కాంగ్రెస్ బహిష్కృత నేత సంజయ్ ఝా

Posted: 07/15/2020 02:43 PM IST
Rajasthan crisis my loyalty to congress ideology not individual sanjay jha

రాజస్థాన్ లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రసకందాయంలో పడింది. రాష్ట్రంలో రాజకీయం సంక్షోభం గంట గంటకూ మారుతోంది. అసలేం జరుగుతుందా అని అలోచిస్తున్న సామాన్యుడు ఒక నిర్ణయానికి వచ్చే లోపు పావులు వేగంగా కదులుతున్నాయి, రాజస్థాన్ ఉఫముఖ్యమంత్రి సచిన్ పైలైట్ తన వర్గం ఎమ్మెల్యేలకు చెందిన వీడియోను విడుదల చేసిన వెంటనే ఆయనను ఉపముఖ్యమంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి పదవుల నుంచి తప్పించిన కాంగ్రెస్.. ఆయనకు మద్దతుగా నిలిచిన ఇద్దరి మంత్రులకు కూడా ఉద్వాసన పలికింది. అంతేకాదు సచిన్ పైలట్ ను సమర్థించిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేతను కూడా కాంగ్రెస్ తమ పార్టీ నుంచి బహిష్కరించింది.  

యువనేత సచిన్‌ పైలట్ ను బహిష్కరించిన కొన్ని గంటలకే మహారాష్ట్రకు చెందిన పార్టీ సీనియర్ నేత సంజయ్ ఝాను కూడా బహిష్కరించింది. పార్టీ కోసం సచిన్ తన రక్తాన్ని ధారపోశారని, ఆయనపై వేటు సరికాదంటూ పార్టీ నిర్ణయాన్ని ఝా తప్పుబట్టారు. రాజస్థాన్‌లో పార్టీ అధికారంలోకి రావడం ఆయన ఘనతేనంటూ ప్రశంసలు కురిపించారు. ఆయన వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న అధిష్ఠానం పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం ఝాకు ఇదే తొలిసారి కాదు. పార్టీలో బోల్డన్ని లోపాలు ఉన్నాయంటూ ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో వ్యాసం కూడా రాశారు. పార్టీ తరపున తరచూ ప్రసార మాధ్యమాల్లో పాల్గొనే ఝాను ఇటీవలే అధికార ప్రతినిధి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు ఏకంగా పార్టీ నుంచే బహిష్కరించింది.

కాంగ్రెస్ యువనేత సచిన్ పైలట్‌కు మద్దతుగా మాట్లాడి, పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన సంజయ్ ఝా స్పందించారు. మరోరకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానానికే ఆయన వార్నింగ్ ఇచ్చారు. తాను వ్యక్తులకు, కుటుంబాలకు బద్ధుడను కానని పేర్కొన్న ఆయన కేవలం కాంగ్రెస్ భావజాలానికి మాత్రమే బద్ధుడిగా ఉంటానన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడున్నారంటూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు గత అర్ధరాత్రి ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలోని ప్రాథమిక సమస్యలను తాను ఎల్లప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందంటూ పార్టీకి హెచ్చరికలు జారీ చేశారు.

సచిన్ పైలట్ తప్పు ఏమాత్రం లేదంటూనే ఆయన వెనుక చేరిన బీజేపి శ్రేణులు ఆయనతో ఇలా పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకత్వం పేర్కోనింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ విషయమై స్పందిస్తూ బీజేపీ కుట్రలో చిక్కుకున్న సచిన్ పైలట్ తప్పుదారి పట్టాడని ఆరోపించారు. "ఇక్కడ సచిన్ పైలట్ చేతుల్లో ఏమీ లేదు, మొత్తం బీజేపీనే నడిపిస్తోంది. తిరుగుబాటుదారుల కోసం రిసార్ట్ ఏర్పాటు చేసింది, అనేక రకాలుగా వ్యవహారం నడిపింది కూడా బీజేపీనే. గతంలో మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం సమయంలో ఏ బీజేపీ బృందం అయితే పనిచేసిందో, ఇప్పుడు రాజస్థాన్ లోనూ అదే బృందం పనిచేస్తోంది. కానీ మావద్ద బీజేపీ పప్పులు ఉడకవు. కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ధన రాజకీయాలు చేయాలనుకున్నారు, రాజస్థాన్ లోనూ అదే చేయొచ్చనుకుంటున్నారు. అయితే ఈ బహిరంగ క్రీడలో వారు ఓడిపోయారు అనుకుంటున్నాను" అంటూ అశోక్ గెహ్లాట్ వివరించారు.

అయితే అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలకు బలం చేకూర్చే విధంగానే బీజేపి కూడా సచిన్ పైలట్ ను ఆహ్వానం పలికింది. పైలట్ నే కాదు ప్రజల్లో అభిమానం సంతరించుకున్న యువనేతలు ఎందరోచ్చినా అందరికీ స్వాగతం పలుకుతామని కేంద్రమంత్రే వ్యాఖ్యానించారు. మరోవైపు సచిన్ పైలట్ సచిన్ పైలట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాద ప్రశంసలు కురిపించారు. సచిన్ పైలట్ తన సహచరుడు మాత్రమే కాదని, తన స్నేహితుడు కూడా అని ఆయన తెలిపారు. ఇన్నేళ్లుగా పార్టీ ఉన్నతి కోసం ఎంతో నిబద్ధతతో సచిన్ పని చేశారనే విషయాన్ని ఎవరూ కాదనలేరని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని అన్నారు. పరిస్థితి ఇంత వరకు రావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles