Ujjaini Mahankali temple oracle predicts tough times ahead బతుకు బధ్రం.. భవిష్యత్ పైలం: రంగంలో స్వర్ణలత సూచన

Secundrabad ujjaini mahankali temple oracle predicts tough times ahead

Ujjian mahankali temple Rangam, Rangam at Ujjaini Mahankali Temple, Bhavishyavani at mahankali temple, Jogini Swarnalatha Bhavishyavani, Bhavishyavani on coronavirus, Ujjian mahankali temple, Rangam, Jogini Swarnalatha, Bhavishyavani, coronavirus, secundrabad, Telangana

The most awaited event - Rangam - at Ujjaini Mahankali temple, Secunderabad, concluded today but with some disheartening predictions about the coronavirus outbreak. An oracle, Swarnalatha, at the temple predicted that the coronavirus predicted that tough times lay ahead, when asked about when the ongoing crisis due to the pandemic could possibly come to an end.

బతుకు బధ్రం.. భవిష్యత్ పైలం: రంగంలో స్వర్ణలత సూచన

Posted: 07/13/2020 04:03 PM IST
Secundrabad ujjaini mahankali temple oracle predicts tough times ahead

రాబోయే రోజుల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.. తనకు ఏమాత్రం సంతోషంగా లేదు.. రాబోయే రోజుల్లో కష్టాలు ఉంటాయి.. ఎంత జాగ్రత్తగా ఉంటే.. అంత మంచిది.. అంటూ స్వర్ణలత హెచ్చరించారు. సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి బోనాల సందర్భంగా సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. పచ్చికొండపై రంగం ఎక్కిన జోగిణి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్, ఇతరత్రా వాటిపై భవిష్యవాణి వినిపించారు. ఎవరి చేసుకున్న వారు చేసుకున్నదే తప్పనిసరిగా అనుభవించాల్సిందేనన్నారు. మీరే చేసుకున్నా దానికి తనకు కూడా సంతోషం లేదు.. ఎంతగానో దు:ఖిస్తున్నా.. అయినా తన బిడ్డలను (ప్రజలను) కాపాడుకుంటా.. రాబోయే రోజుల్లో చాల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.

రాబోయే రోజుల్లోనూ కష్టాలు ఉంటాయని అమ్మవారు తెలిపారు. తన బిడ్డలు మరింత జాగ్రత్తాగా వుండాలని సూచించారు. ఐదు వారాలు సాకలు పోసి హోమాలు జరపాలి.. భక్తి భావంతో కొలిస్తేనే.. తాను కాపాడుతానని అమ్మవారు భక్తులకు తరుణోపాయాలు తెలిపారు. గంగా దేవికి యాగాలు జరపాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని కష్టాలు తప్పవన్న ఆమె... ప్రజలంతా ధైర్యంగా ఎదుర్కోవాలని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. తాను వారిని కాపాడతానని అన్నారు. ఐదు వారాలపాటూ తనను పూజించాలనీ, యజ్ఞహోమాలు జరిపించాలని రంగంలో అమ్మవారు కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles