Man challenges to kill corona with lemon drops నిమ్మరసంతో కరోనాకు చెక్: ఛాలెంజ్ విసురుతున్న పగో లయన్..

West godavari man challenges to kill corona in infected with lemon drops

Ranga Venkateshwara Rao, lemon, lion venkateshwar Rao corona tip, lemon drops, nossil holes, coconut oil, coronavirus, covid-19

West Godavari Man challenges to kill corona in infected with lemon drops and challenges to pay Rs 50,000 if he fails. This post is going viral on social media as his friends making it trending

నిమ్మరసంతో కరోనాకు చెక్: ఛాలెంజ్ విసురుతున్న పగో లయన్..

Posted: 07/09/2020 07:47 PM IST
West godavari man challenges to kill corona in infected with lemon drops

కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ లక్షలాది మంది ప్రాణాలను ఇప్పటికే కబళించివేసింది, ఇది చైనా పుట్టించిన ప్లేగ్ లాంటిదని అమెరికా అద్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేసినా.. కాదు ఇది ముమ్మాటికి చైనా బయో వెపన్ అని మరోదేశం అరోపించినా.. కరోనా మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఈ మహమ్మారి జడలు విప్పి కరాళనృత్యం చేస్తున్న క్రమంలో ఇంట్లోంచి బయటకు అడుగుటు వేయాలంటేనే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే కరోనా నుంచి రక్షణ పోందేందుకు మాస్క్ తప్పనిసరని, బయటకు వెళ్తే చేతులకు సానిటైజర్ రాసుకోవడం కూడా మర్చిపోకూడదని వైద్యులు, ప్రభుత్వాలు కూడా తెలిపారు.

కరోనా మహమ్మారి అని తెలియగానే ఆసుపత్రులు బెడ్లు లేవని చెప్పడంతో పాటు అసలు పేషంట్లను కూడా కాపాడేందుకు కూడా సాహసం చేయడం లేదని అరోపణలు వస్తున్నాయి. ఇక తాజాగా నమోదవుతున్న ఘటనల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేకపోవడంతో ప్రైవేటు వైద్యం కోసం కార్పోరేట్ అసుపత్రులను ఆశ్రయించిన పలువురు బాధితులు అక్కడ బిల్లులను చూసి బెంబేలెత్తుతున్నారు. కరోనా నేపథ్యంలో బాధితులను వ్యాపార కోణంలో చూడకుండా మానవతా దృక్పథంతో ఆలోచించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వినతిని కూడా కార్పోరేట్ ఆసుపత్రులు పరిగణలోకి తీసుకోవడం లేదు. బిల్లులతో బాధితులు ఆస్తులు అమ్ముకునేలా చేస్తున్నారన్న సెటైర్లు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

రూ.50 వేల ఛాలెంజ్..

 

ఈ క్రమంలో లక్షల రూపాయల బిల్లులతో పనిలేదని, ఖరీదైన మాస్కులు, సానిటైజర్లు కూడా అవసరం లేదని.. చిన్న చిట్కాతో కరోనాను ఒంట్లోంచి తరిమేయవచ్చునని, దానికి అయ్యే ఖర్చు చెబితే మాత్రం ఎవరూ నమ్మరంటూ ఓ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రాణాలు కబళించివేసే మహమ్మారికి కాలం చెల్లేలే చేసే చిన్న చిట్కా.. కరోనా బాధితుల పాలిట అల్లాద్దీన్ అద్బుత దీపం లా పనిచేస్తుందని పోస్టులో పేర్కోన్నారు. ఈ చిట్కా ఎంటి.. ఏమేం వస్తువులు కావాలి.. అన్న అవసరం కూడా లేదని.. నిత్యం ఇంట్లో వినియోగించే వస్తువులతోనే కరోనాను మటుమాయం చేయవచ్చునని అంటున్నారు. అంతేకాదు తాను సూచించినట్లు చేసిన తరువాత కూడా కరోనా నుంచి తాము విముక్తి పోందలేదని నిరూపించిన వారికి యాభై వేల రూపాయలను కూడా బహుమానంగా అందిస్తామంటున్నారు.

చిట్కా.. ఇలా చేస్తే కరోనా ఖతం..

 

ఇంతకీ కరోనాను తరమేందుకు కావాల్సిన రెండు పధార్థాలు ఏంటంటే.. నిమ్మకాయ, కొబ్బరినూనె మాత్రమే. ఉదయం నిద్ర లేవగానే నాసికా రంధ్రాల్లో (ముక్కులోని రెండు రంధ్రాల్లో) ఒకచుక్క నిమ్మరసం వేసుకొంటే ముక్కులో, గొంతులో,శ్వాస కోశాల్లో దాగి ఉన్న కరోనా వైరస్ అంతా శ్లేష్మ రూపంలో నోటిలోనికి వచ్చేస్తుందని.. దాన్ని కాండ్రించి ఉమ్మివేయాలని అంటున్నారు లయన్ రంగా వెంకటేశ్వరరావు. ఆ తరువాత తదుపరి గోరువెచ్చని నీటిలో ఉప్పు, నిమ్మరసం కలిపి పుక్కిలించి ఉమ్మాలి. అదీనూ రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల పాటు చేయాలి. ఆ వెంటనే బాధితులకు రిలీఫ్ గా ఉంటుంది. తర్వాత శుభ్రమైన కొబ్బరి నూనె చుక్కలను వేలికి రాసుకుని.. దానిని నిదానంగా ముక్కు రంధ్రాలకు (నాసికా రంధ్రాలకు) రాయాలి.

రంగా వెంకటేశ్వరరావు మిత్రులు, సన్నిహితులు సోషల్ మీడియాలో పోస్టును విపరీతంగా ట్రెండింగ్ చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్య్యక్షులుగా, జిల్లాసేవా కో-ఆర్డినేటర్ గా పనిజేసి, తను అధ్యక్షుడుగా కొనసాగుతున్న లయన్ రంగా వెంకటేశ్వరరావు చిట్కాతో అనేక మంది కరోనా పాజిటివ్ బాధితులు నెగిటివ్ రిజల్ట్ సాధించారు. ఈ ప్రయోగం చేసిన పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుుల సైతం కోలుకుని వెంకటేశ్వర రావుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలోని ప్రజలు వెంకటేశ్వరరావు చిట్కాను వినియోగించిన కరోనా కబంధహస్తాల నుంచి బయటపడుతున్నారు. దీంతో కొలుకున్న ప్రతీ ఒక్కరు వెంకటేశ్వరరావు చిట్కాను తమ సోషల్ మీడయాలో పోస్టు చేసిన అందరికీ అందుబాటులోకి తీసుకువస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : corona tip  lemon drops  nossil holes  coconut oil  coronavirus  covid-19  

Other Articles

Today on Telugu Wishesh