CBI carries out searches at GVK group premises జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌, ఆయన కుమారుడిపై సీబీఐ కేసు

Mumbai airport scam cbi carries out searches at gvk group premises

GVK group, GVK group news, raids on GVK group, CBI raids on GVK group, corruption, Crime

The CBI has booked Gunupati, a director in MIAL, his son GV Sanjay Reddy, managing director in MIAL, the companies MIAL, GVK Airport Holdings Limited and nine other private companies allegedly used to camouflage the inflated figures through sham deals and unidentified AAI officials, they added.

జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌, ఆయన కుమారుడిపై సీబీఐ కేసు

Posted: 07/02/2020 10:20 PM IST
Mumbai airport scam cbi carries out searches at gvk group premises

నిధుల దుర్వినియోగం కేసులో జీవీకే గ్రూప్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ జి.వి.కృష్ణారెడ్డి, ఆయన కుమారుడిపై కేంద్ర దర్యాప్తు బృందం సీబిఐ కేసు నమోదు చేసింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి, నిర్వహణలో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు గాను వీరిపై కేసులు నమోదు చేసిన సీబిఐ.. అటు ముంబైతో పాటు ఇటు హైదరాబాద్ లోని సంస్థ కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఇక ఈ నిధుల దుర్వినియోగం కేసులో వారికి సహకరించారన్న అరోపణలపై విమానాశ్రయ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజయ్‌రెడ్డి తో పాటు మొత్తంగా తొమ్మిది సంస్థలపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

విమానాశ్రయం అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌.. జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్ తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేసింది. ఇందులో ముంబయి విమానాశ్రయ అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థ మియాల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 2017-18లో బోగస్‌ కంపెనీలకు కాంట్రాక్టులు ఇచ్చినట్టు చూపించి నిధులను దారి మళ్లించినట్టు సీబీఐ ఆరోపించింది. తద్వారా ఏకంగా రూ.705 కోట్ల అక్రమాలకు సంస్థ పాల్పడిందని అభియోగాలు మోపబడ్డాయి. ఈ కేసులో జీవీకే రెడ్డి, సంజయ్‌రెడ్డి సహా మియాల్‌, జీవీకే ఎయిర్‌పోర్టు హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, మరో తొమ్మిది కంపెనీలు, ఎయిర్‌ పోర్టు అథారిటీకి చెందిన కొందరు అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GVK group  GVK group news  raids on GVK group  CBI raids on GVK group  corruption  Crime  

Other Articles