PVP gets bail in threatening a neighbour case వైసీపీ నేత పీవీపీకి హైకోర్టులో తాత్కాలిక ఊరట

Ysrcp leader potluri vara prasad gets bail in threatening a neighbour case

YSRCP leader, Potluri Vara Prasad, Jubilee Hills Police Station, PVP, dogs, HIgh Court, Anticipatory bail, AP State government, Amaravati, Telangana, Andhra Pradesh, crime

Veteran film producer and YSR Congress Party leader Potluri Vara Prasad (PVP) has been granted advance bail from High Court in the case of trespassing on the villa owner. Last week a man named Kailash lodged a complaint at the Banjara Hills police station alleging PVP of blocking him from the construction of roof garden.

వైసీపీ నేత పీవీపీకి హైకోర్టులో తాత్కాలిక ఊరట

Posted: 07/01/2020 03:51 PM IST
Ysrcp leader potluri vara prasad gets bail in threatening a neighbour case

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ నేత, వ్యాపారవేత్త, ప్రముఖ నిర్మాత, వైసీపీ నేత పోట్లూరి వరప్రసాద్ (పీవీపీ)కు రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. తాను విక్రయించిన విల్లా అధునీకరణ విషయంలో కొనుగోలుదారుల ఇంటిలోకి చోరబడి వారిని భయభ్రాంతులకు గురిచేసి.. దౌర్జన్యం చేసిన కేసులో పీవీపిని అరెస్టు చేయవద్దని న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. పీవీపీ నుంచి విల్లాను ఖరీదు చేసిన పోరుగింటివారు ఆయనపై బంజారాహిల్స్ పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు తనను అరెస్టు చేయకుండా పివీపీ రాష్ట్రోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటీషన్ ను విచారించిన న్యాయస్థానం ఆయనను అరెస్టు చేయవద్దని అదేశాలను జారీ చేసింది. ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వుల వరకు ఆనయను అరెస్టు చేయకుడదని న్యాయస్థానం తమ ఉత్తర్వులలో పేర్కోంది. దీంతో పోరుగింటి వారిపై దౌర్జన్యం సహా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులలో ఆయన తాత్కాలిక ఊరట లభించింది.

తన ఇంటి పొరుగున విల్లాలో నివాసముంటున్న యజమానిపై దౌర్జన్యం చేసి వారి ఇంట్లోకి తన మనుషులతో కలిసి హల్చల్ చేసిన కేసులో పోలీసులు ఆయనపై అనేక సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదైన క్రమంలో తొలిరోజు విచారణకు హాజరైన పీవీపీ రెండో రోజు డుమ్మాకోట్టాడు. దీంతో ఆయనను విచారించేందుకు ఆయన నివాసానికి వెళ్లగా వారిని లోనికి ప్రవేశించకుండా ఆయన తన పెంపుడు కుక్కలను పోలీసులపైకి ఉసిగొల్పాడు. దీంతో పోలీసులు విధులకు ఆటంకం కల్గించడంతో పీవీపీపై పోలీసులు మరో కేసును కూడా నమోదు చేశారు.

పోలీసుల అధికారుల విచారణను అడ్డుకునేందుకు, వారిపై దాడి, లేదా విధులకు ఆటంకం కలిగించేలా ప్రవర్తించనందుకు గాను ఆయనపై పోలీసులు 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కావాలని కోరడంతో న్యాయస్థానం పీవీపీ బెయిల్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఈకేసుకు సంబంధించి పోలీసులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జులై 27కు వాయిదా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP leader  Potluri Vara Prasad  HIgh Court  Anticipatory bail  Banjara hills  Hyderabad  Telangana  Crime  

Other Articles