'Doda Militancy Free,' Says JK Police after encounter ఉగ్రవాద రహితంగా మారిన దోడ : జమ్మూకాశ్మీర్ పోలీస్

3 terrorists killed in encounter with security forces in jammu and kashmirs anantnag

Jammu and Kashmir, Jammu and Kashmir encounter, Anantnag, encounter, Kashmir encounter, Khulchohar, Anantnag encounter, Hizbul Mujahideen, Hizbul commander, Jammu and Kashmir, Lakshar-e-Taiba (LeT), Terrorists

Three unidentified terrorists were gunned down by security forces in Jammu and Kashmir's Anantnag district on Monday, police said. Following inputs about terrorists in Khulchohar area of the south Kashmir district, the security forces launched a search operation.

ఉగ్రవాద రహితంగా మారిన దోడ : జమ్మూకాశ్మీర్ పోలీస్

Posted: 06/29/2020 03:13 PM IST
3 terrorists killed in encounter with security forces in jammu and kashmirs anantnag

జమ్మూ-కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. భారత సైనిక దళాలతో పాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, జమ్మూకాశ్మీర్ పోలీసులు చేస్తున్న ఉగ్రవాద నివారణ ఫలితాలు ఇస్తోంది. భారత్ దేశంలో చిచ్చుపెట్టేందుకు.. అల్లకలోల్లం సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రేరేమిత ఉగ్రవాద సంస్థలు నిత్యం పాకులాడుతున్నాయి. అయితే వాటిని అంతే ధైర్యంగా ఎదుర్కోంటూ మట్టుబెట్టుతున్నాయి భారత బలగాలు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్ లో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్ బుల్ ముజాహిద్దీన్ టాప్ కమాండర్ తో పాటు మరో ఇద్దరు మరణించారు,

దీంతో పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జమ్మూకాశ్మీర్ లోని ఓ జిల్లాలో పూర్తిగా పట్టుకోల్పోయింది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో అనంత్ నాగ్ జిల్లా ఖుల్ చోహార్ ప్రాంతంలో ఉగ్రవాదులతో ఆనంత్ నాగ్ పోలీసులు, రాష్ట్రీయ రైఫీల్స్, సీఆర్పీఎఫ్, జరిపిన ఎన్ కౌంటర్లో ఇద్దరు లష్కరే తోయిబా టెరరిస్టులతో పాటు జిల్లా కమాండర్ కూడా మరణించాడని తెలిపారు. జిల్లా హిజ్ బుల్ కమాండ్ ను మసూద్ అని, మరో ఇద్దరిలో ఒకరు అనంత్ నాగ్ జిల్లాలోని లాల్ చౌక్ ప్రాంతానికి చెందిన తరీఖ్ ఖాన్ అని, మరోకరు ఖుల్గామ్ ప్రాంతానికి చెందిన నదీమ్ గా పోలీసులు గుర్తించాయి, ఇక మసూద్ తో పాటు వీరిని భారత బలగాలు మట్టుబెట్టాయని, దీంతో ఇక దోడా జిల్లా ఉగ్రవాద రహితంగా మారిపోయిందని తెలిపారు.

ఇవాళ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. అనంత్‌ నాగ్‌ జిల్లా ఖుల్‌ చొహార్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో సోమవారం ఉదయం పోలీసులు సాయుధ బలగాల సాయంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దీంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే హతమయ్యారు. సంఘటనా స్థలంలో ఓ ఏకే-47తో పాటు రెండు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఏ ఉగ్రసంస్థకు చెందినవారన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

దీంతో ఈ ఏఢాదిలో ఇప్పటి వరకు ఏకంగా 116 మంది ఉగ్రవాదులతో పాటు ఏడుగురు కమాండర్లను భారత బలగాలు మట్టుబెట్టాయి. ఈ నెలలో భారత బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ల సంఖ్య ఇవాళ్టి దానితో కలిపి 13వది. ఈ మొత్తం 13 ఎన్ కౌంటర్లలో మొత్తం 40 మంది ఉగ్రవాదలు హతమయ్యారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులే భారత బలగాల ప్రధాన టార్గెట్ గా ఎంచుకుంది. ఈ ఏడాదిలోనూ హిజ్బుల్ ముజాహిద్దీన్ కీలక నేత రియాజ్ నైకో కూడా భారత బలగాల చేతుల్లో హతమైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh