FDA Warns of Toxic Hand Sanitizers అలర్ట్: మెక్సికో బయోకెమ్ శానిటైజర్లతో జాగ్రత్తా

Toxic hand sanitizer fda warns consumers to avoid 9 hand sanitizer brands

coronavirus, covid-19, Food and Drug Administration, Hand sanitizer, Mexico based company, Eskbiochem, Methanol, Wood alcohol, warning, fellowes gel, health and wellness

The Food and Drug Administration released a warning statement saying consumers should not buy hand sanitizer products from the Mexico-based manufacturer Eskbiochem. The warning comes after the FDA discovered methanol, or wood alcohol, in these products. Methanol can be dangerous when ingested or absorbed through the skin, and it can be fatal in large quantities.

అలర్ట్: మెక్సికో బయోకెమ్ శానిటైజర్లతో జాగ్రత్తా

Posted: 06/24/2020 09:49 PM IST
Toxic hand sanitizer fda warns consumers to avoid 9 hand sanitizer brands

కరోనా మహమ్మారి జడలు విప్పి కళరా నృత్యం చేస్తున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా దేశాల ఆరోగ్య సంస్థలన్నీ వారి ప్రజలను అప్రమత్తం చేసింది. ఈ తరుణంలో ప్రజలందరూ చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపర్చుకోవాలని కూడా సూచించాయి. అయితే అందుకుగాను హ్యాండ్ సానిటైజర్లు వినియోగం విరివిగా వుంది. అయితే చేతులను శుభ్రపర్చుకునే తరుణంలో హ్యాండ్ సానిటైజర్లలో పలు విష‌పూరిత ర‌సాయ‌నాలు ఉన్నాయని తాజాగా అగ్రరాజ్యానికి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. వీటిలో ముఖ్యంగా మెక్సికో సంస్థకు చెందిన ఎస్కే బయోకెమ్ తయారు చేసిన శానిటైజర్లు వినియోగించరాదని సూచించింది.

ఈ సంస్థ తయారు చేసిన శానిటైజర్లను అధికంగా వినియోగిస్తే మరణాలు కూడా సంభవించే ప్రమాదముందని హెచ్చరించింది. మరీ ముఖ్యంగా ఈ సంస్థ నుంచి వచ్చిన తొమ్మిది శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించొద్ద‌ని అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చ‌రించింది. ఇప్ప‌టికే మార్కెట్ల‌కు త‌ర‌లించిన ఉత్ప‌త్తుల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని ఎస్క్ బయోకెమ్ సంస్థ‌‌ను ఆదేశించింది. ఈ సంస్థ త‌యారు చేసిన శానిటైజ‌ర్ల‌లో ప్ర‌మాద‌కర మిథ‌నాల్ ఉంద‌ని ఎఫ్‌డీఏ గుర్తించింది. మిథ‌నాల్ ఉన్న శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించ‌డం ఆరోగ్యానికి ప్ర‌మాద‌క‌రం. దానిని చేతులకు రాసుకున్నప్పుడు అది చర్మం దీనిని శోషించుకుంటుందని అన్నారు.

ఫ‌లితంగా వికారం, జ‌లుబు, వాంతులు, త‌ల‌నొప్పి, చూపు కోల్పోవ‌డం, కోమా, వ‌ణుకు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొన్నిసార్లు న‌రాల వ్య‌వ‌స్థ దెబ్బ‌తిని మ‌ర‌ణానికీ దారితీసే ప్ర‌మాదం ఉంది. ఇప్ప‌టికే మిథ‌నాల్ క‌లిసిన శానిటైజ‌ర్లు ఉప‌యోగించిన వారు వైద్యుల‌ను సంప్ర‌దించాల‌ని ఎఫ్‌డీఏ తెలిపింది. మార్కెట్ల‌లోని ఆల్ క్లీన్ హ్యాండ్ శానిటైజ‌ర్‌, ఎస్క్ బ‌యోకెమ్ హ్యాండ్ శానిటైజ‌ర్, క్లీన్ కేర్ నోజెర్మ్ హ్యాండ్ శానిటైజ‌ర్, లావ‌ర్ 70 జెల్ హ్యాండ్ శానిటైజ‌ర్, ది గుడ్ జెల్ యాంటీ బ్యాక్టీరియ‌ల్ జెల్ హ్యాండ్ శానిటైజ‌ర్, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజ‌ర్ 70% ఆల్క్‌హాల్‌, క్లీన్ కేర్ నోజెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజ‌ర్ 80% ఆల్క‌హాల్‌, శాండిడెర్మ్ అడ్వాన్స్‌డ్ హ్యాండ్ శానిటైజ‌ర్ల‌ను ఉప‌యోగించొద్ద‌ని వినియోగ‌దారుల‌కు ఎఫ్‌డీఏ సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  covid-19  FDA  Hand sanitizer  Mexico based company  Eskbiochem  Methanol  Wood alcohol  warning  

Other Articles