Andhra govt cancels 10th and Inter supplimentary exams పవన్ కల్యాణ్ కోరిక తీర్చిన జగన్ సర్కార్.. విద్యార్థులు ఫుల్ హ్యాపీ

After pawan kalyan urges andhra govt cancels 10th and inter supplimentary exams

Pawan Kalyan, YSRCP Government, 10th class students, 10th class exams, 10th results, Intermiediate supplimentary exams, inter supplimentary exams, coronavirus, JanaSena, Twitter, Andhra Pradesh, Politics

After Janasena chief Pawan Kalyan urges Andhra Pradesh government to cancel 10th class exams, the state Government had cancelled 10 th class exams in the state and also cancels intermiediate supplimentary exams passing out all the students of Inter.

పవన్ కల్యాణ్ కోరిక తీర్చిన జగన్ సర్కార్.. విద్యార్థులు ఫుల్ హ్యాపీ

Posted: 06/20/2020 11:54 PM IST
After pawan kalyan urges andhra govt cancels 10th and inter supplimentary exams

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోరిన రెండు రోజుల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన మనవిని ఆలకించింది. పదో తరగతి విద్యార్థుల ముఖాలలో సంతోషాన్ని నింపింది. అంతేకాదు ఇంటర్మీడియట్ విద్యార్థుల జీవితాల్లోనూ కొత్త ఆశలు రేకెత్తించింది, అయితే ఇటీవల ప్రకటించిన ఇంటర్ ఫలితాల రోజునో లేక అంతుకుముందే ఈ నిర్ణయం తీసుకుని వుంటే.. ఇంటర్ లో తప్పామన్న మానిసిక ఆవేదనతో తమ జీవితాలను ముగించుకున్న పలువురి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందించేవారు.

ఇంతకీ విషయం ఏంటంటే పరీక్షల పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం మానుకోవాలని పవన్ కల్యాణ్ కోరిన వెంటనే అ మేరకు రాష్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. దీంతో పాటు ఇంటర్ విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసింది. పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే వారి అంతర్గత మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కలు, గ్రేడులను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ నెల 15న భాగస్వామ్య పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభిప్రాయాలు సేకరించామని, ఆ తరువాత కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనలు మేరకు నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు.

పదో తరగతి పరీక్షలను తొలుత వచ్చే నెల 10 నుంచి 17 మధ్య నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరీక్షలకు ఏకంగా 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల కోసం 11 పేపర్లను ఆరుకు కుదించారు. అయినా.. పరీక్షలు అనగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, జిల్లాల కలెక్టర్లు, పోలీసులు, ఉపాధ్యాయులు, ఇన్విజిలేటర్లు, స్పాట్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఇలా అనేక మంది ఒక్క చోట గుమ్మిగూడటం అంత శ్రేయస్కరం కాదని.. సీఎం జగన్ అదేశాల మేరకు పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని అన్నారు. వీటితో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తున్నామని తెలిపారు. ఇంటల్ లో తప్పిన విద్యార్థులందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటిస్తామని మంత్రి ప్రకటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  YSRCP Government  10th class exams  JanaSena  Andhra Pradesh  Politics  

Other Articles