Col. Santosh Babu cremated with military honours ఆశ్రునయనాల మధ్య కల్నాల్ సంతోష్ అంతిమ సంస్కారాలు

Col santosh babu killed in ladakh clash cremated with military honours

Santosh Babu, b Santosh Babu, Eastern Ladakh, india china, india china faceoff, indo china border, Ladakh standoff, indian army, chinese army, Colonel Santosh Babu, Colonel B Santosh Babu, Ladakh clash, Galwan valley, China, military honours, Tributes, Telanganites, congress

The mortal remains of Colonel Bikkumalla Santosh Babu - who died in the line of duty, along with 19 other soldiers, in a clash with Chinese troops in eastern Ladakh on Monday night, were consigned to flames with full military honours in his agriculture farm at Kesaram village of Telangana's Suryapet district

ఆశ్రునయనాల మధ్య కల్నాల్ సంతోష్ అంతిమ సంస్కారాలు

Posted: 06/18/2020 06:20 PM IST
Col santosh babu killed in ladakh clash cremated with military honours

అమరవీరడు కల్నల్ భిక్కుముళ్ల సంతోష్ బాబు పార్థీవదేహానికి ఇవాళ సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. లడఖ్ లోని గాల్వన్ లోయలో వద్ద సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణలో తన ప్రాణలను తృణప్రాయంగా వదలి మరీ దేశం కోసం వీరమరణం పోందిన సంతోష్ బాబు అంత్యక్రియలు ఇవాళ పూర్తైయ్యాయి. సూర్యాపేట సమీపంలోని కేసారంలో ఉన్న సంతోష్‌బాబుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో అంతిమ సంస్కారాలు జరిగాయి. సైనిక సంస్కారాల ప్రక్రియలో 16 బిహార్‌ రెజిమెంట్‌ బృందం పాల్గొంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే అంత్యక్రియలకు బంధువులను, స్థానికులను జిల్లా కలెక్టర్ టి. వినయ్‌కృష్ణారెడ్డి అనుమతించారు.

అయినా సరిగ్గా అంతిమయాత్ర జరిగే సమయానికి పెద్ద సంఖ్యలో స్థానికులు తరలివచ్చి.. సంతోష్ బాబు జోహర్ అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి, సంతోష్ బాబు .. అమర్‌ రహే, వందే మాతరం అంటూ పెద్ద పెట్టున చేసిన నినాదాల మధ్య ముందుగా విద్యానగర్ లోని సంతోష్ బాబు ఇంటి నుంచి ఎంజీ రోడ్డు, శంకర్ విలాస్ కూడలి, రైతు బజార్, పాత బస్టాండు, కోర్టు కూడలి, ఎస్పీ కార్యాలయం మీదుగా కేసారంలోని వ్యవసాయ క్షేత్రం వరకు అంతిమయాత్ర సాగింది. సంతోష్ బాబు అంతిమయాత్ర వెళ్లే దారి పోడవునా స్థానికులు తమ ఇళ్లు, భవనాలపైకి ఎక్కి సంతోష్ బాబుకు ఘన నివాళులు అర్పించారు.

సూర్యాపేటలో వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. సంతోష్ బాబు స్వగ్రామానికి ఆయన పార్థీవ దేహం అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో స్వగ్రామానికి చేరుకోవడంతో క్రితం రోజు జరగాల్సిన అంత్యక్రియలు ఇవాళ జరగాయి, సంతోష్ బాబు పార్థీవదేహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,  పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ డి.అర్వింద్ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించారు, వీరితో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తదితరులు సంతోష్ బాబు మృతదేహానికి నివాళులు అర్పించారు. మంత్రి జగదీశ్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సంతోష్‌బాబు అంత్యక్రియలకు హాజరయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles