Col. Santosh Babu's martyrdom hailed కల్నాల్ సంతోష్ వీరమరణం. నివాళులర్పించిన జనం

I am proud of my son says martyred colonel santosh babus mother

Santosh Babu, b Santosh Babu, Eastern Ladakh, india china, india china faceoff, indo china border, Ladakh standoff, indian army, chinese army, Colonel Santosh Babu, Colonel B Santosh Babu, Tributes, Telanganites, congress

The mother of Colonel B. Santosh Babu, who was killed by the Chinese Army in Eastern Ladakh on Monday night, is proud that her son made the supreme sacrifice for the sake of the country. Commanding Officer Santosh Babu, who along with two jawans was killed in the face-off between the two armies during the de-escalation in Galwan Valley, hailed from Suryapet district in Telangana.

ITEMVIDEOS: కల్నాల్ సంతోష్ వీరమరణం.. గర్వంగా వుందన్న కన్న తల్లి

Posted: 06/16/2020 11:47 PM IST
I am proud of my son says martyred colonel santosh babus mother

లడఖ్ లోని గాల్వన్ లోయలో వద్ద సరిహద్దు ప్రాంతంలో భారత్- చైనా సైనికుల మధ్య ఘర్షణపూరిత వాతావరణం అలుముకుంది. ఈ ఘటనలో చైనాకు చెందిన సైనికులు పలువురు మరణించగా, భారత్ కు చెందిన ఓ కల్నాల్ సహా ఇద్దరు జవాన్లు దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరవీరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. గత ఏప్రిల్‌ నుంచి లద్దాఖ్‌ ప్రాంతంలో చైనా గస్తీ ఎక్కువవడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. చైనా సైన్యం కదలికలపై నిఘా వేసింది.

ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాలకు భారీ ఎత్తున చైనా బలగాలను మోహరించడాన్ని పసిగట్టిన భారత్.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. వందలాది మంది సైనికుల్ని సరిహద్దుకు తరలించింది. ఈ క్రమంలో గత నెలలో పాంగాంగ్‌ సరస్సు ఒడ్డున ఇరు దేశాల సైనికులు ఘర్షణకు తలపడ్డారు. దీంతో రెండు వైపులా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. కాగా చర్యలతో సమస్యకు చెక్ పెడదామని భావించిన తరుణంలో చర్చలు ముగిసిన తరువాత భారత బలగాలపైకి డ్రాగన్ దేశం సైన్యం ఘర్షణకు దిగడం, ఫలితంగా ప్రతిదాడికి పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా ఈ ఘటనలో భారత్ కు చెందిన ఓ కల్నాల్, ఇద్దరు జవాన్లు మరణించారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికాధికారి తెలుగువాడు కావడంతో మరీ ముఖ్యంగా సూర్యపేట జిల్లాకు చెందినవాడు కావడం తెలంగాణవాసుల్ని విషాదంలోకి నెట్టింది, కల్నాల్ మరణంపై స్పందించిన సీఎం కేసీఆర్, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ అతని వీరమరణంపై సంతాపాన్ని తెలిపారు, తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన సంతోష్ భారత ఆర్మీలో కల్నల్ ర్యాంకు అధికారి. ఇటీవలే హైదరాబాద్ రెజిమెంట్ కు బదిలీ అయిన సంతోష్.. ఇక్కడకు వచ్చే లోపే ఆయన అమరుడు కావడం విషాదకరం. ఆర్మీ అధికారులు సంతోష్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

కాగా, తన కుమారుడు కల్నల్ సంతోష్ బాబు వీరమరణం చెందడంపై ఆయన తల్లి స్పందించారు. ఈ మేరకు సూర్యపేటలో వున్న ఆమె.. తన కొడుకు మరణం పట్ల గర్వంగా వుందని అన్నారు. తనకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారని, ఆ ఒక్క కొడుకూ ఇప్పుడు అమరుడయ్యాడని ఆమె అన్నారు. తల్లిగా బిడ్డను కోల్పోయిన బాధ ఉన్నా, తన కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడం పట్ల గర్వంగా వుందని పుట్టెడు దుఃఖాన్ని భరిస్తూ నిబ్బరంగా చెప్పారు. తనకు ఈ విషయం ఇవాళ మధ్యాహ్నం తెలిసిందని, ఢిల్లీలో ఉన్న తన కోడలికి నిన్న రాత్రే ఈ విషయం తెలిసినా, తాను తట్టుకోలేనని ఇవాళ్టి వరకు చెప్పలేదని ఆమె వివరించారు.

సరిహద్దులో భారత్ చైనా బలగాల మధ్య తలెత్తిన ఘర్షణపూరిత వాతావరణంలో భారత్ కు చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పోందడంపై సంఘీభావం వెల్లివిరిసింది. మరీముఖ్యంగా కల్నాల్ సంతోష్ బాబు తెలంగాణ వాసి అని తెలియడంతో తెలంగాణవ్యాప్తంగా ప్రజలు ఆయన మృతికి సంఘీభావం వ్యక్తం చేశారు, మంగళవారం రాత్రి బీర్కూరులో కాంగ్రెస్ నాయకులు కామప్ప కూడలీ వద్ద కొవ్వత్తులతో ర్యాలీ నిర్వహించి వీర జవాన్‌కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ హైమద్,  ఏఎస్సై రాజలింగం, కాంగ్రెస్ నాయకులు గంగారం, రాచప్ప, నాగరాజు, పాండు, వెంకటేశం, కదీర్‌‌, హైమద్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Santosh Babu  Mother  Proud  Telanganites  Tributes  Eastern Ladakh  India  china  Face-off  congress  

Other Articles