Heavy rain predicted in Telangana for next 3 days పలకరించిన రుతుపనవం.. తెల్లవార్లూ కురసిన వర్షం..

Southwest monsoon arrives in telangana imd hyderabad

Monsoon arrives in Telangana, Telangana weather, Telangana Monsoon, Hyderabad IMD, Telangana rainfall, Monsoon, Monsoon showers, Hyderabad, Telangana

The Hyderabad Center of India Meteorological Department had predicted a very likely occurrence of light to moderate rain or thundershowers at a few places over Telangana till June 15 and also issued a warning for 'isolated heavy to very heavy rainfall' for three days starting Thursday.

పలకరించిన రుతుపనవం.. తెల్లవార్లూ కురసిన వర్షం..

Posted: 06/11/2020 05:04 PM IST
Southwest monsoon arrives in telangana imd hyderabad

కరోనా వైరస్ కాటు వేస్తున్న తరుణంలో ఇంకా ఎన్ని వైపరిత్యాలను ఎదుర్కోవాలో అని అలోచిస్తున్న తరుణంలో రైతన్నకు కడగండ్లను దూరం చేసేందుకు ఈ సారి మాత్రం వరుణుడు నడుం చుట్టాడు. అన్నదాతకు అర్థనాథాలను దూరం చేసేందుకు సహకరిస్తున్నాడు. సరిగ్గా సమయానికి రాష్ట్రానికి చేరుకున్న వరుణుడు.. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన కరుణను వర్షం రూపంలో కురిపిస్తున్నాడు. ఫలితంగా రాష్ట్రంలో రుతుపవనాలు తొలకరి జల్లులను కురిపించేందుకు బదులు ఏకబిగిన వర్షాన్ని కురిపించాడు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిన్న మధ్యాహం నుంచి ప్రారంభమైన వర్షం.. రాత్రి వరకు ఆ తరువాత తెల్లవార్లూ కురిసింది. భానుడి తాపానికి భగభగమండిన నగరం సహా రాష్ట్రం.. ఒక్కసారిగా చల్లబడింది.

తెలంగాణలోని వచ్చిన రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నిన్న వర్షం కురిసింది. ఇక రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి.. రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు కె,నాగరత్నం తెలిపారు. నిన్న సాయంత్రం 4 గంటల హైదరాబాద్ సహా నిజామాబాద్, రామగుండం, పెద్దపల్లి, సహా పలు జిల్లాల్లో వర్షం కురిసిందని.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరిస్తాయని అమె తెలిపారు, వీటి ప్రభావంతో రానున్న రెండు మూగు రో్జులు పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తుందని అమె అంచనావేసారు. అయితే పలు జిల్లాలో మాత్రం ఏడు నుంచి 20 సెంటీమీటర్ల వర్షం పడుతుందని అన్నారు. భువనగిరి యాదాద్రి జిల్లాలో ఇవాళ ఉదయం వరకు 19 సెంమీ వర్షం కురిసిందని తెలిపారు.

ఇక హైదరాబాద్ లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి 12 గంటల ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, గంటల పాటు ప్రజలు నిద్ర లేకుండా గడపాల్సి వచ్చింది. ఇక నిన్న రాత్రి 10 గంటల సమయానికే 6 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అబ్దుల్లాపూర్ మెట్ లో అత్యధికంగా 9 సెంమీ వర్షపాతం నమోదైందని వెల్లడించారు. లోతుకుంట, హబ్సీగూడ, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, మలక్ పేట, కూకట్ పల్లి, అమీర్ పేట, షేక్ పేట, మియాపూర్, చందానగర్, భెల్ కాలనీ, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లోని లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి.

ఈ ఉదయం రహదారులపై భారీ ఎత్తున నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించారు. ఇదిలావుండగా, మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు, ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో గత రాత్రి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లోని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఉమ్మడి వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Monsoon  Monsoon showers  Telangana Monsoon  Hyderabad IMD  Telangana rainfall  Hyderabad  Telangana  

Other Articles