China on Harvard research suggesting virus spread నిజం నిష్టూరం: ఆగస్టులోనే కరోనా.. భగ్గుమన్న చైనా

Ridiculous china on harvard research suggesting virus spread in august

SARS-CoV-2 pandemic, Coronavirus, Covid-19, Harvard Medical School, Harvard research, satallite images, Hospital travel pattern, search engine, china, biowar, US

The coronavirus might have been spreading in China as early as August last year, according to Harvard Medical School research based on satellite images of hospital travel patterns and search engine data, but China dismissed the report as 'ridiculous'.

నిజం నిష్టూరం: ఆగస్టులోనే కరోనా.. హావార్డ్ కథనంపై భగ్గుమన్న చైనా

Posted: 06/09/2020 10:02 PM IST
Ridiculous china on harvard research suggesting virus spread in august

చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిఃస్తన్న విషయం తెలిసిందే. అయితే, ఇది ప్రపంచ దేశాలపై చైనా విసిరిన బయోవార్ అని కొన్నివాదనలు తెరపైకి వచ్చాయి. కాగా ఇధి ముమ్మాటికీ సత్యదూరమైన వార్త అని అటు చైనా ఖండిస్తూనే వుంది. అంతేకాదు అగ్రరాజ్యం అమెరికాకు చెందిన పలు సంస్థలు కూడా ఇది బయోవార్ కాదని, ఇది సహజంగా వచ్చిన వైరసేనని కూడా నిర్థారించాయి. అయితే ఎంతమంది ఎన్ని చెప్పినా.. ఈ విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత రావాల్సివుంది. ఇక దీంతో పాటు అసలు వుహాన్ నగరంలో ఈ వైరస్ ఉనికి ఎప్పుడు మొదలైందన్న విషయంలోనూ పలు అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా కలుగుతూనే వున్నాయి.

అయితే కరోనా మహమ్మారి సహజమైనదా.? లేక మానవ సృష్టేనా అన్న విషయంలో ఇప్పటికే అనుమానాలు వున్నా.. అసలు ఈ వైరస్ ఎప్పుడు ఉనికిని చాటుకుందన్న విషయంలో మాత్రం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది ఓ అధ్యయనం. చైనా ప్రకటించిన అధికారిక గణాంకాల ప్రకారం డిసెంబరు నెలలో కరోనా వైరస్ తన ఉనికిని చాటుకుందని తెలుస్తున్నా, వాస్తవానికి అంతకుముందే కరోనా కలకలం రేగిందని తెలుస్తోంది. అందుకు హార్వర్డ్ మెడికల్ స్కూలు చేసిన ఓ అధ్యయనం దోహదపడుతోంది. చైనాలో ఆగస్టు మాసంలోనే కరోనా తన ఉనికిని చాటుకుందని తమకు పలు విధాలుగా నిర్థారణ అయ్యిందని హార్వర్డ్ మెడికల్ స్కూల్ స్పష్టం చేస్తోంది.

గత ఏడాది ఆగస్టులోనే చైనాలోని వూహాన్ నగరంలో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైందని, ఆ సమయంలో వుహాన్ నగరంలోని ఆసుపత్రుల్లో విపరీతమైన రద్దీ కనిపించిందని వివరించింది. ఆసుపత్రుల పార్కింగ్ స్థలాలు కూడా కార్లు ఇత్యాది వాహనాలతో నిండిపోయాయని తెలిపింది. కొన్ని శాటిలైట్ చిత్రాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నామని హార్వర్డ్ పరిశోధకులు వెల్లడించారు. అదే సమయంలో, వుహాన్ నగరంలోని ప్రజలు ఇంటర్నెట్లో దగ్గు, ఇతర అనారోగ్య లక్షణాల గురించి సెర్చ్ చేయడంలో బాగా పెరుగుదల కనిపించిందని తెలిపారు. గత సీజన్లతో పోలిస్తే ఆగస్టులో వీటిపై జరిగిన సెర్చ్ చాలా ఎక్కువ అని వివరించారు. వుహాన్ లోని హువాన్ సీ ఫుడ్ మార్కెట్లో కరోనాను గుర్తించిన సమయం కంటే ముందే ఈ వైరస్ వ్యాప్తి మొదలైందన్న వాదనలకు తమ వద్ద ఉన్న ఆధారాలు సరిపోలుతున్నాయని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SARS-CoV-2 pandemic  Coronavirus  Covid-19  Harvard research  US  

Other Articles