Tirumala temple to hold trial run of darshan శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల దర్శనానికి ట్రయల్ రన్

Tirumala temple to hold trial run of darshan with limited devotees

coronavirus, covid-19, AP government, Tirumala Tirupati Devasthanam (TTD), trial run, 'darshan', Tirumala darshan, Tirumala temple, TTD employees, local devotees, Andhra Pradesh

The Andhra Pradesh government has given nod to Tirumala Tirupati Devasthanam (TTD) to conduct a trial run of 'darshan' at the Tirumala temple with TTD employees and local devotees.

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల దర్శనానికి ట్రయల్ రన్

Posted: 06/02/2020 08:40 PM IST
Tirumala temple to hold trial run of darshan with limited devotees

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ దేవాలయ కమిటీ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భక్తుల దర్శనానికి సడలింపులు ఇవ్వడంతో దేవాలయ కమిటీ భక్తుల దర్శనానికి పచ్చజెండా ఊపింది. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు అనుమతించింది. భక్తులు 6 అడుగులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని టీటీడీకి ప్రభుత్వం సూచించింది. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్‌ 5.0తో ఆలయాల దర్శనకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ తరుణంలో రాష్ట్రం కూడా టీటీడీ కమిటీకి అనుమతులు మంజూరు చేసింది.

అయితే ఈ ట్రయల్ రన్ లో భాగంగా భక్తులందరినీ దర్శనానికి అనుమతించాలని కోరుతూ టీటీడీ ఈవో రాసిన లేఖకు స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్... అందుకు అనుమతిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ట్రయల్ రన్ లో భాగంగా భక్తులందరినీ దర్శనానికి అనుమతించకుండా కేవలం సిబ్బందిని, స్థానికులను మాత్రమే దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ దర్శనాలు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న దర్శనాలు.. విజయవంతం అయిన తరువాత చిత్తూరు జిల్లా వరకు ఆ తరువాత రాష్ట్రం నుంచి అనుమతించనున్నారు.

ఈ మేరకు ఈ నెల 8 నుంచి ప్రయోగాత్మక దర్శనాలను ప్రారంభించనున్నట్లు తితిదే వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీకి అదేశించింది. ఈ నేపథ్యంలో గంటకు 300 మందికి మాత్రమే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తితిదే స్పష్టం చేసింది. రోజుకు 15 గంటలపాటు శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తితిదే వివరించింది. అయితే సాధారణ భక్తులను శ్రీవారి దర్శనానికి ఎప్పటినుంచి అనుమతిస్తారనే విషయంలో స్పష్టత రావాల్సిఉంది. కరోనా కారణంగా తిరుమలలో భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరుమల చరిత్రలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles