Swiggy, Zomato to deliver liquor at doorsteps మద్యం హోం డెలివరీని ప్రారంభించిన స్విగ్గీ, జోమాటో.

Zomato swiggy begin home delivery of liquor in select cities

Jharkhand Government, Jharkhand Liquor, Jharkhand Liquor home delivery, Liquor home delivery, alcohol, home delivery, Swiggy, Zomato, amazon, food delivery, lockdown, Jharkhand, Ranchi, covid-19

Food delivery unicorns Swiggy and Zomato have enabled online processing and home delivery of alcohol in non-metros, in an attempt to diversify when their core business has been hit due to the covid-19 lockdown.

మద్యం హోం డెలివరీని ప్రారంభించిన స్విగ్గీ, జోమాటో.. ఇవాళ్టి నుంచే ప్రారంభం..

Posted: 05/21/2020 10:03 PM IST
Zomato swiggy begin home delivery of liquor in select cities

కరోనావైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఆన్ లైన్‌ ఫుడ్ డెలివరీ యాప్ లను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. ప్రజలు బయటి ఆహారా పదార్థాలపై ఆధారపడకూడదని, ఇంట్లోనే వండుకుని వేడివేడిగా తినాలని కూడా సూచించాయి. ఈ నేపథ్యంలో గత 55 రోజులుగా వ్యాపారాలను కొల్పోయిన ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు ఇక నాల్గవ విడత లాక్ డౌన్ లో భాగంగా కేంద్రప్రభుత్వం కల్పించిన సడలింపులతో మళ్లీ రంగంలోకి దూసుకొచ్చాయి. అంతేకాదు తాము కొల్పోయిన వ్యాపారం మొత్తాన్ని కూడా రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.

అందులో భాగంగా ఆహారాన్నే కాకుండా ఏకంగా మద్యాన్ని కూడా సరఫరా చేయడాన్ని ఇవాళ్టి నుంచే ప్రారంభించాయి. మద్యాన్ని కూడా వినియోగదారులకు హోం డెలివరీని చేసే సదుపాయాన్ని ఇవాళ్టి నుంచి ప్రారంభించాయి, ప్రస్తుతానికి తమ సేవలు జార్ఖండ్‌లోని రాంచితో ప్రారంభమయ్యాయని తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. కాగా ఆ రాష్ట్రంలోని మరిన్ని పట్టణాలకు కూడా ఓ వారంలోగా తమ సేవలను విస్తరిస్తామని స్విగ్గీ వెల్లడించింది. కాగా, ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సేవలను విస్తరించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు. తమ కంపెనీ యాప్‌లో ‘‘వైన్‌ షాప్స్‌’’ విభాగంలో ఆన్‌లైన్‌ మద్య సరఫరా సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ అధికారులు తెలిపారు.

ఆన్ లైన్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, వినియోగదారుల ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేసేందుకు గాను తాము లైసెన్సు, అవసరమైన ఇతర అనుమతులు కలిగిన స్థానిక దుకాణాలతో ఒప్పందాలు చేస్తున్నామని స్విగ్గీ వివరించింది. అమలులో ఉన్న లాక్ డౌన్‌, కరోనా వైరస్ తదితర నిబంధనలను తాము పాటిస్తామని... వినియోగదారు చిరునామా, వయస్సు తదితర వివరాలు నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే వారికి మద్యాన్ని అందచేస్తామని సంస్థ అధికారులు వివరించారు. ఈ విధంగా నిబంధనలకు లోబడి హోం డెలివరీ సేవలు అందించటం ద్వారా రిటైల్‌ మద్యం దుకాణాలకు కూడా అదనపు వ్యాపారాన్ని అందించినట్టు అవుతుందని స్విగ్గీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : alcohol  home delivery  Swiggy  Zomato  amazon  food delivery  lockdown  Jharkhand  Ranchi  covid-19  

Other Articles